యాప్నగరం

యజమాని భార్యతో అఫైర్.. శవమై కనిపించిన ఉద్యోగి.. ఐదు నెలల తర్వాత ట్విస్ట్

నిఖిల్‌ ఆత్మహత్య చేసుకున్న మూడు నెలల తర్వాత ఆశ్చకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిఖిల్‌ తోబుట్టువులు సంజయ్‌, నిష అతడి ఫోన్‌ను పరిశీలిస్తుండగా అందులో కీలక సమాచారం లభ్యమైంది.

Samayam Telugu 19 Dec 2019, 3:27 pm
వ్యాపార లావాదేవీల్లో మునిగిపోయిన బిజినెస్‌మెన్ తన భార్యను లైంగికంగా తృప్తి పరిచేందుకు తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగిని వేధించిన ఘటన గుజరాత్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్‌ గోమతిపూర్‌కు చెందిన నిఖిల్‌ పర్మార్‌(19) ఓ సంస్థలో పనిచేసేవాడు. అయితే ఐదు నెలల క్రితం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Samayam Telugu illegal-affair_1200x900xt


Also Read: యువతిని తల్లిని చేసిన వివాహితుడు... గొంతు కోసి చంపేసిన బాధితురాలు

నిఖిల్ వాస్నాలోని వెడ్డింగ్‌ డెకరేషన్‌ స్లపయింగ్‌ కంపెనీలో గతేడాది అక్టోబర్‌లో ఉద్యోగంలో చేరాడు. అయితే ఆ కంపెనీ యజమాని(45) వ్యాపార లావాదేవీల్లో పడి భార్య(25)ను సరిగ్గా పట్టించుకోవడం మానేశాడు. దీనికి తోడు ఆ దంపతుల మధ్య వయసు వ్యత్యాసం కూడా ఎక్కువగా ఉండటంతో సెక్స్ పరంగా అనేక గొడవలు తలెత్తేవి. రోజూ భార్య సూటిపోటి మాటలను తట్టుకోలేని ఆ యజమాని తన భార్యను లైంగికంగా తృప్తి పరచాలంటూ నిఖిల్‌ను కోరాడు. దీనికి ముందు నిఖిల్ ఒప్పుకోకపోవడంతో జీతం పెంచుతానని ఆశచూపించాడు. దీంతో నిఖిల్ యజమాని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె తృప్తి పరిచేవాడు.

Also Read: తమిళనాడులో మహిళా టీచర్ ఆత్మహత్య.. విషాదంలో తెలుగువారు

కొద్దినెలల పాటు సజావుగానే సాగిన ఈ వ్యవహారంతో యజమానికి చిర్రెత్తుకొచ్చింది. భార్య తనను పట్టించుకోకుండా నిఖిల్‌ మాయలోనే గడిపేస్తుండటాన్ని అతడు తట్టుకోలేకపోయాడు. దీంతో తన భార్యతో అఫైర్‌కు ముగింపు పలకాలని అతడిపై ఒత్తిడి తెచ్చాడు. ఇదే విషయాన్ని నిఖిల్ ఆమెకు చెప్పగా ఆగ్రహం వ్యక్తం చేసింది. తనతో అక్రమ సంబంధం కొనసాగించకపోతే అంతు చూస్తానని అతడిని హెచ్చరించింది. దీంతో యజమాని దంపతుల మధ్య నలిగిపోయిన నిఖిల్ జులై నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read: వేలూరులో దారుణం.. బాలికను కొండపై నుంచి తోసేసిన ప్రియుడు

ముందుగా నిఖిల్ ఏ కారణంతో చనిపోయాడో ఎవరికీ అంతుబట్టలేదు. పోలీసులు సైతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిఖిల్‌ ఆత్మహత్య చేసుకున్న మూడు నెలల తర్వాత ఆశ్చకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిఖిల్‌ తోబుట్టువులు సంజయ్‌, నిష అతడి ఫోన్‌ను పరిశీలిస్తుండగా అందులో కీలక సమాచారం లభ్యమైంది. నిఖిల్‌ అతడి యజమానికి పంపిన మెసేజ్‌లు అందులో కనిపించాయి. ‘మీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెను లైంగికంగా తృప్తి పరచమని నాకు చెప్పారు. మీరు చెప్పినట్లే ఆమెతో అఫైర్ పెట్టుకున్నాను. ఇప్పుడేమో ఆమెతో బంధాన్ని వదులుకోవాలంటూ బెదిరిస్తూ జీతం కూడా ఇవ్వడం లేదు. ఇకపై నన్ను వదిలేయండి’ అంటూ నిఖిల్ యజమానికి చేసిన మెసేజ్ వారి కంట పడింది. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు దర్యాప్తు వేగవంతం చేశారు. నిఖిల్ యజమాని, ఆమె భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read: డ్యాన్సర్లు, అమ్మాయిలతో వ్యభిచారం.. హైదరాబాద్‌ పబ్‌లో 32 మంది అరెస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.