యాప్నగరం

విజయవాడలో మరో గ్యాంగ్‌ వార్.. రాత్రివేళ మారణాయుధాలతో దాడులు

విజయవాడ నగరంలో రెండు వర్గాల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జులై 31న జరిగిన వార్‌పై రెండు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

Samayam Telugu 11 Aug 2020, 7:06 am
విజయవాడ నగరంలో అల్లరిమూకలు మరోసారి రెచ్చిపోయారు. పటమట ప్రాంతంలో రెండు వర్గాలుగా విడిపోయిన యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన గ్యాంగ్‌వార్‌ను తలపించింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కేదారేశ్వరపేట ఖుద్దూస్‌నగర్‌కు చెందిన షేక్‌ నాగుల్‌మీరా(మున్నా), రాహుల్‌ అనే యువకుల వర్గాల మధ్య పాత గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జులై 31వ తేదీన రాహుల్‌తో పాటు అయోధ్యనగర్‌కు చెందిన వినయ్‌ తదితరులు కేదారేశ్వరపేటలో కత్తులు, కర్రలతో నాగుల్‌మీరా వర్గంపై దాడికి పాల్పడ్డారు.
Samayam Telugu Image


Also Read: తల్లికి మత్తు మందిచ్చి కూతురిపై అత్యాచారం... కోనసీమలో కామాంధుడు

అదే రోజు రాత్రి 7.30 గంటల సమయంలో నాగుల్‌మీరా వర్గానికి చెందిన ఈసబ్‌, సాయికుమార్‌ తదితరులు అయోధ్యనగర్‌ బసవతారకనగర్‌ రైల్వే క్యాబిన్‌ సమీపంలో వినయ్‌, రాహుల్‌ తదితరులపై కత్తులు, ఇతర మారణాయుధాలతో దాడి చేశారు. అయితే పోలీసుల భయంతో ఈ ఘటనను రెండు వర్గాలు బయటకు రానీయలేదు. ఇలా ఉండగా అయోధ్యనగర్‌కు చెందిన పుట్టా వినయ్‌ (18) తనపై ఖుద్దూస్‌నగర్‌కు చెందిన షేక్‌ నాగుల్‌మీరా(25), న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన షేక్‌ ఈసబ్‌ (26), బుడమేరు మధ్యకట్ట ప్రాంతానికి చెందిన లావేటి సాయికుమార్‌(24), సీతన్నపేటకు చెందిన నాగులాపల్లి సాయి పవన్‌(20), కృష్ణలంకకు చెందిన కంది సాయికుమార్‌ (20)లతో పాటు మరికొందరు దాడి చేసినట్లు అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులకు ఈ నెల 9వ తేదీన ఫిర్యాదు చేశాడు.


Also Read: ఆంటీని దోచుకున్న యువకులు.. ఆరా తీస్తే సెక్స్‌ కుంభకోణం గుట్టురట్టు

పుట్టా వినయ్‌ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి సోమవారం కోర్టులో హాజరుపరిచారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి ఓ బైక్, కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు తనపై 9 మంది వ్యక్తులు కత్తులు, ఇతర మారణాయుధాలతో కేదారేశ్వరపేట ప్రాంతంలో దాడి చేశారంటూ షేక్‌ నాగుల్‌మీరా (మున్నా) ఆదివారం సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుతో ఖుద్దూస్‌నగర్‌కు చెందిన రాహుల్‌, పటమటకు చెందిన సాయికిరణ్‌, అయోధ్యనగర్‌కు చెందిన పుట్టా వినయ్‌, వికాస్‌ అనే యువకులను సోమవారం అరెస్టు చేసినట్లు సీఐ బాలమురళీకృష్ణ తెలిపారు. వీరి నుంచి సైతం కత్తులు స్వాధీనం చేసుకున్నామని, మరో ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

Also Read: పరాయి మహిళపై మోజుతో భార్యనే కడతేర్చాడు.. సిద్దిపేటలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.