యాప్నగరం

టీ షర్ట్ లాగేసి.. జాతీయ స్థాయి క్రీడాకారిణికి లైంగిక వేధింపులు

కబడ్డీ క్రీడాకారిణిపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. జాతీయ స్థాయి క్రీడాకారిణిని అసభ్యకరంగా తాకుతూ కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు వేధింపులకు పాల్పడడం చర్చనీయాంశమైంది.

Samayam Telugu 23 Jan 2020, 9:48 pm
జాతీయ స్థాయి క్రీడాకారిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై కేసు నమోదైంది. ఏషియన్ గేమ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన కబడ్డీ క్రీడాకారిణి పట్ల కబడ్డీ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ క్రీడాకారుడు వేధింపులకు పాల్పడి, కొట్టినట్లు క్రీడాకారిణి చేసిన ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
Samayam Telugu harassment


కబడ్డీ అసోసియేషన్‌లో రిపోర్ట్ చేయాల్సిందిగా క్రీడాకారిణికి సమాచారం రావడంతో ఆమె బెంగళూరులోని కబడ్డీ క్యాంప్‌కు వచ్చింది. ఆ సమయంలో కబడ్డీ అసోసియేషన్‌లో కీలక పదవి నిర్వహిస్తున్న బీసీ రమేష్ మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ఆమెపై అనుచితంగా ప్రవర్తించారు. ఆమెను కొట్టి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు క్రీడాకారిణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నలుగురిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.

Also Read: మమ్మల్ని సుఖపెడితేనే నీకు ఉద్యోగం.. ఆ కోరిక తీర్చాలంటూ మహిళా ఉద్యోగికి వేధింపులు

కబడ్డీ క్రీడాకారిణి.. బీసీ రమేష్ సహా కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులకు పరిచయం చేసేందుకు తన సహోద్యోగిని కూడా వెంట తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ సందర్భంగా నలుగురు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించారని.. తన టీషర్ట్ లాగి అనుచితంగా వ్యవహరించారని క్రీడాకారిణి ఆరోపించింది. ఈ విషయమై వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని బెంగళూరు డీసీపీ ధ్రువీకరించారు. కబడ్డీ క్యాంప్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు.

Read Also: ‘నీ కూతురు, అల్లుడు తగలబడుతున్నారు.. చేతనైతే కాపాడుకో’ హంతకుడి ఫోన్

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీసీ రమేష్.. మాజీ కబడ్డీ క్రీడాకారుడు. అర్జున అవార్డు గ్రహీత కావడం గమనార్హం. ఆయన ప్రస్తుతం పలు కబడ్డీ జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన గతంలో బెంగళూరు బుల్స్, పూణె, బెంగాల్ టైగర్స్ జట్లకు కూడా కోచ్‌గా బాధ్యతలు నిర్వహించినట్లు సమాచారం.

Also Read: విద్యార్థినిని ఇంట్లో బంధించి అత్యాచారం.. తూర్పు గోదావరిలో కీచక వార్డెన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.