యాప్నగరం

అమ్మాయి పెళ్లి చేసుకుంటానంటే నమ్మేశాడు పాపం.! చివరికి చుక్కలు చూపించి..

పెళ్లి పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. మ్యాట్రిమొనియల్ వెబ్‌సైట్‌ ద్వారా పరిచయమైన ఓ యువతి యువకుడి నుంచి అందికాడికి డబ్బు కాజేసిన ఘటన చోటుచేసుకుంది.

Samayam Telugu 17 Mar 2020, 8:32 pm
మ్యాట్రిమొనియల్ వెబ్‌సైట్‌ పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్‌ వివాహ వేదికల ద్వారా తమకు సరైన జోడీ దొరుకుతుందని భావిస్తున్న యువతీయువకులు మోసగాళ్లకు బలవుతున్నారు. మీ ప్రొఫైల్ నచ్చింది.. మిమ్మల్నే పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి యువకుడి నుంచి అందికాడికి దోచేసిన ఓ కిలాడీ లేడీ ఉదంతం వెలుగుచూసింది.
Samayam Telugu marriage


ముంబైకి చెందిన ఓ ఆర్టిస్ట్‌కి మ్యాట్రిమొనియల్ వెబ్‌సైట్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. తాను యూకేలో ఉంటానని.. మీ ప్రొఫైల్ నచ్చిందని చెప్పడంతో యువకుడు ఎగిరి గంతేశాడు. మిమ్మల్నే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో పూర్తిగా నమ్మేశాడు. ఓ రోజు ఆమె ఫోన్ చేసి తాను ఇండియా వస్తున్నానని.. మిమ్మల్ని కలుస్తానని చెప్పింది.

Also Read: నరకం: బంగ్లాలో బంధించి గ్యాంగ్ రేప్.. యువతి కేకలు విని..

ఇండియా వస్తున్నట్లు విమానం టిక్కెట్లు కూడా పంపించి నమ్మించింది. సడెన్‌గా ఫోన్ చేసి తాను ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యానని.. తన వద్ద లెక్కచెప్పని యూకే కరెన్సీ ఉండడంతో కస్టమ్స్ అధికారులు నిలిపివేశారని చెప్పింది. అందుకు ఫైన్ కట్టాల్సి ఉందని.. మిమ్మల్ని కలిసిన సమయంలో ఆ నగదు అందజేస్తానని చెప్పడంతో ఆ నగదు పంపేందుకు యువకుడు ఒప్పుకున్నాడు.

వెంటనే తను చెప్పిన బ్యాంకు ఖాతాకు రూ.59 వేలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆ తరువాత మళ్లీ ఫోన్ చేసి మరో రూ.2.5 లక్షలు వేయాలని అడగడంతో అనుమానం వచ్చిన యువకుడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. పెళ్లి పేరుతో ఓ యువతి తనను మోసం చేసి డబ్బులు కాజేసిందని ఆలస్యంగా గ్రహించిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also: కూతురితో కలసి కన్నతల్లి ఘాతుకం.. కొడుకు పీకకోసి.. విశాఖలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.