యాప్నగరం

యువతి ఎదుట ఆటోడ్రైవర్ పాడుపని.. ఆమె సెల్‌ఫోన్‌లో వీడియో తీసి..

ఆటో ఎక్కిన యువతి ఎదుట అసభ్యంగా ప్రవర్తించాడో ఆటో డ్రైవర్. ఆమె ఆ తతంగాన్నంతా వీడియో తీసి పోలీసులకు పంపించడంతో లైంగిక వేధిపులకు గురిచేసిన డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు.

Samayam Telugu 4 Mar 2020, 3:30 pm
కాలేజీకి వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఎవరూ లేని ప్రదేశం చూసి ఆటోడ్రైవర్ పాడుపని చేయడంతో షాక్‌కు గురైంది. ఆ తతంగాన్నంతా వీడియో తీసి పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అసభ్యకరంగా ప్రవర్తించినందుకు కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది.
Samayam Telugu harassment


కాలేజీ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ముంబైలో జరిగింది. మలాడ్‌లోని కాలేజీకి వెళ్లేందుకు ఓ విద్యార్థిని ఆటో ఎక్కింది. దారిలో ఎవరూ లేని ప్రదేశం చూసి ఆటోని నిలిపివేసిన ఆటోడ్రైవర్ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. తన జననాంగాన్ని బయటకు తీసి హస్తప్రయోగం చేయడం ప్రారంభించాడు.

Also Read: రూ.30 వేల కోసం ఓనర్ కక్కుర్తి.. 20 మంది బలి!

యువతిని ఆటో అద్దంలో నుంచి తదేకంగా చూస్తూ హస్తప్రయోగం చేశాడు. ఆమెపై లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఊహించని ఘటనతో షాక్‌కు గురైన యువతి ఆటోడ్రైవర్ అసభ్య ప్రవర్తనను సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసింది. అనంతరం యువతి సోషల్ మీడియా ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో నిందితుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Read Also: సూర్యాపేటలో ఘోరం.. బాలికను పొదల్లోకి లాక్కెళ్లి రేప్.. ఒంటిపై పెట్రోల్ పోసి..

విద్యార్థిని ఫిర్యాదు మేరకు గోరెగావ్‌కి చెందని ఆటోడ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతంలోనూ ముంబైలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. యువతి ఎదుట మర్మాంగాన్ని ప్రదర్శించిన కేసులో ఒకరిని అరెస్టు చేశారు. మరో సంఘటనలో యువతి వెళ్లాల్సిన దారిలో కాకుండా ఆటోను వేరే దారి వైపు మళ్లించడంతో ఆమె ఆటో నుంచి దూకేసిన ఘటన చోటుచేసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.