యాప్నగరం

హోటల్ యజమాని కూతురితో ప్రేమాయణం.. కోరిక తీర్చుకుని పరారైన ఆటోడ్రైవర్

సరుకులు సరఫరా చేసే క్రమంలో ఆటోడ్రైవర్ రవిగౌడ్ హోటల్ యజమానిక కూతురిని ప్రేమలోకి దించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Samayam Telugu 13 Feb 2020, 2:50 pm
హోటల్ యజమాని కుమార్తెతో ప్రేమాయణం నడిపిన ఓ ఆటోడ్రైవర్ ఆమెను లొంగదీసుకుని మోజు తీరిన తర్వాత ఉడాయించిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. దీంతో ప్రేమించిన వాడితో పెళ్లి జరిపించాలని బాధితురాలు ఆత్మహత్యకు యత్నించింది. నిజాంపేట రాజీవ్‌గృహకల్ప సముదాయంలో నివసించే ఓ కుటుంబం కూకట్‌పల్లి జేఎన్‌టీయూ వద్ద ఓ హోటల్‌ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బాచుపల్లికి చెందిన ఆటోడ్రైవర్‌ రవిగౌడ్‌ హోటల్‌కు అవసరమైన సరకులను సరఫరా చేసేవాడు.
Samayam Telugu GettyImages-140471382_2


Also Read: భీమవరంలో యువకుడి కిడ్నాప్.. టీడీపీ ఎంపీ గన్‌మెన్‌పై ఆరోపణలు

ఈ క్రమంలోనే హోటల్ యజమాని కుమార్తె(20)తో అతడికి చనువు పెరిగింది. దీంతో ఆమెకు మాయమాటలు చెప్పి ప్రేమలోకి దించాడు. పెళ్లి చేసుకుంటానని శారీరకంగా లొంగదీసుకుని అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి నిలదీయడంతో కనిపించకుండా తిరుగుతున్నాడు. దీంతో ఆమె రవిగౌడ్‌ గురించి ఆరా తీయగా అతడికి అప్పటికే పెళ్లయి, ఇద్దరు పిల్లలున్నట్లు తెలియడంతో షాకైంది.

Also Read: పాప తనకు పుట్టలేదన్న భర్త, అదనపు కట్నం కోసం అత్త వేధింపులు.. తట్టుకోలేక

మోసపోయానని గ్రహించిన బాధితురాలు ప్రియుడితోనే పెళ్లి చేయించాలని కోరుతూ బుధవారం బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. పోలీసులు ఆమెను విచారిస్తున్న సమయంలో నీరసంగా కనిపించడంతో ఏమైందని అడిగారు. తాను పురుగుల మందు తాగి స్టేషన్‌కు వచ్చినట్లు చెప్పడంతో వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. రవిగౌడ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు. యువతి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు.

Also Read: గర్భం దాల్చిన టెన్త్ బాలిక.. పెళ్లి చేసుకోనని మొహం చాటేసిన ప్రియుడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.