యాప్నగరం

‘అంద’మైన కలలతో నగరానికి.. అనూహ్యంగా సూసైడ్.. ఓ యువతి విషాదాంతం

బ్యూటీషియన్ అవుదామని కలలు కంది. ఎక్కడో చిన్న పల్లెటూరు నుంచి నగరానికి బయల్దేరింది. అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న తరుణంలో ఓ యువతి అర్ధాంతరంగా తనువు చాలించిన విషాద ఘటన హైదరాబాద్‌లో జరిగింది.

Samayam Telugu 25 Feb 2020, 3:39 pm
అందమైన కలలతో నగరానికి వచ్చిన ఓ యువతి అర్ధాంతరంగా తనువు చాలించింది. బ్యూటీషియన్ అవుదామన్న ఆశతో మూడేళ్ల కిందట ఊరుదాటిన ఆ యువతి గదిలో ఫ్యాన్ కొక్కేనికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె పనిచేస్తున్న మహిళతోనే కలిసి ఉంటున్న ఆమె.. ఆ ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట పరిధిలో చోటుచేసుకుంది.
Samayam Telugu death3


సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలం మల్లారెడ్డి గూడెం గ్రామానికి చెందిన పి.డేవిడ్ రాజు ఎలక్ట్రీషియన్. ఆయన కూతురు హిమబిందు(22) బ్యూటీషియన్ అవుదామన్న ఆశతో మూడేళ్ల కిందట నగరానికి వచ్చింది. బ్యూటీషియన్ కోర్సు, అవకాశాల కోసం తిరుగుతున్న హిమబిందుకి ఆస్మాన్‌గఢ్ పరిధిలోని వెంకటాద్రినగర్ ధాత్రి నిలయంలో ఉంటున్న స్వాతి అనే మహిళతో పరిచయం ఏర్పడింది.

Also Read: ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. గుంటూరు వాసుల దుర్మరణం

స్వాతి బ్యూటీషియన్ కావడంతో ఆమె వద్దే హెల్పర్‌గా పనిచేస్తోంది. స్వాతి కుటుంబంతోనే కలసి ఉంటోంది. ఈ నేపథ్యంలో ఓ రోజు ఇంట్లోని బెడ్రూమ్‌లో హిమబిందు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని.. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని చెప్పారని స్వాతి సోదరుడు సాయికిషోర్ పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. అర్ధరాత్రి 10.30 గంటల సమయంలో ఫోన్ రావడంతో పోలీసులు ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు.

Read Also: కొడుకును లాడ్జి గది బయట నిలబెట్టి.. ప్రియుడితో మహిళ రాసలీలలు.. భర్త వీడియో కాల్ చేయడంతో..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హిమబిందు ఎందుకు చనిపోయింది? బలవన్మరణానికి పాల్పడాల్సిన అవసరమేంటి? కొత్త పరిచయాలే ఆమె ప్రాణాల మీదకు తెచ్చాయా? ప్రేమ మాయలో పడి మోసపోయిందా? ఇలాంటి అనేకానేక సందేహాల నడుమ నిజాలు నిగ్గుతేల్చే పనిలో పడ్డారు పోలీసులు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని.. సాయికిషోర్‌‌ను పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం.

Also Read: స్వీట్ లేడీ సెక్స్ చాట్.. రూ.100కి ఒక న్యూడ్ ఫొటో.. ఆ తరువాత దిమ్మతిరిగిపోయే ట్విస్టులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.