యాప్నగరం

కూతురి పెళ్లి ఘనంగా చేసి జైలుపాలయ్యాడు.. కేరళలో అంతే

నిబంధనలకు విరుద్ధంగా కూతురి పెళ్లి వేయి మంది అతిథులతో చేసినందుకు కేరళలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం 60 మందినే ఆహ్వానించాలని తహసీల్దార్ చెప్పినా అతడు పట్టించుకోలేదట.

Samayam Telugu 22 Mar 2020, 3:39 pm
గతంలో పెళ్లంటే ఊరందరినీ పిలిచి గొప్పగా చేసుకునేవారు. పెళ్లి ఎంత మంది అతిథులొస్తే అంత గొప్పగా చెప్పుకునేవారు. కానీ కరోనా వైరస్ కారణంగా ఆ పరిస్థితి తారుమారు అయింది. పెళ్లికి ఎక్కువ మంది అతథులను పిలిస్తే ఇప్పుడు ఏకంగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. కేరళలో ఇలాగే ఓ పెద్దాయన తన కూతురి పెళ్లిని ఏకంగా వేయి మంది అతిథుల మధ్య అంగరంగ వైభవంగా జరిపించాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆయనపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు.
Samayam Telugu ffdfd


Also Read: కలెక్టర్ ఇంటికే కన్నం వేసిన దొంగలు.. 55 సవర్ల బంగారం చోరీ

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించింది. దీంతో పెళ్లిళ్లకు భారీ సంఖ్యలో అతిథులను ఆహ్వానించొద్దని, కుటుంబసభ్యుల సమక్షంలోనే శుభకార్యాలు జరిపించుకోవాలని ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తూ అల్లప్పుజా నగరంలోని అరాట్టువాజీ ప్రాంతానికి చెందిన షమీర్ అహ్మద్ ఇటీవల తన కుమార్తెకు టౌన్ హాలులో వెయ్యిమంది అతిధులతో ఘనంగా వివాహం చేశారు.

Also Read: తాళికట్టే సమయానికి వరుడి అరెస్ట్... అసలేం జరిగిందంటే..

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షమీర్ అహ్మద్ ఐపీసీ 269, 188, 118(ఈ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శనివారం అరెస్ట్ చేశారు. ఈ వివాహానికి 60 మందికి మించి అతిథులను ఆహ్వానించొద్దని తహసీల్దార్ ఆదేశించినా అహ్మద్ పట్టించుకోలేదు. తన బంధువులతో పాటు నగరంలోని స్నేహితులు, పరిచయస్తులందరినీ ఆహ్వానించి ఘనంగా కూతురి పెళ్లి జరిపించాడు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన అతడిపై తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Also Read: రూ.4వేలకే ఐఫోన్... అడ్డంగా బుక్కయిన హైదరాబాద్ యువతి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.