యాప్నగరం

తల్లి పింఛన్ కోసం తగాదా.. చెల్లెలిపై అన్న అమానుషంగా..

ఆఖరి రోజుల్లో తల్లిని చూసుకునేందుకు అన్నాచెల్లెలు గొడవపడ్డారు.చివరికి చెల్లెలి కుటుంబంపై అన్న వర్గీయులు మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

Samayam Telugu 4 Feb 2020, 12:40 pm
తల్లిని చూసుకునే విషయమై జరిగిన గొడవ చినికిచినికి మారణాయుధాలతో దాడికి దారితీసింది. తల్లికి వచ్చే పింఛన్ తింటున్నారంటూ వదిన దూషించిందని తల్లిని కూతురు ఇంట్లో నుంచి వెళ్లగొట్టింది. కొడుకు ఇంట్లోకి రావడానికి వీల్లేదన్నాడు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వృద్ధురాలు ఉంటే.. అన్నాచెల్లెలు మాత్రం పరస్పరం దూషించుకుంటూ ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్న ఘటన కర్ణాటకలో జరిగింది.
Samayam Telugu murder.


దేవనహళ్లి తాలూకా దొడ్డసాగరహళ్లి గ్రామానికి చెందిన బిజుమాకు కుమారుడు ఇమాంసాబ్, కుమార్తె జంగమా సంతానం. వృద్ధాప్యంతో బాధపడుతున్న బిజుమా పదిహేనేళ్లుగా కూతరు జంగమా వద్దే ఉంటోంది. అయితే అన్నా చెల్లెలి కుటుంబాలు ఒకే ఊరిలో ఉండడంతో ఇరుకుటుంబాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. బిజుమాకి వచ్చే పింఛన్ డబ్బులన్నీ తింటున్నారంటూ జంగమా కనిపించినప్పుడల్లా వదిన నన్నిమా దూషణలకు దిగుతోంది.

Also Read: చెల్లెలిపై అన్న అత్యాచారం.. గుంటూరు జిల్లాలో దారుణం

పింఛన్ డబ్బులు తింటున్నావన్న వదిన మాటలతో మనస్థాపానికి గురైన జంగమా.. తన తల్లి బిజుమాని ఇంట్లో నుంచి వెళ్లగొట్టింది. ఆ వృద్ధురాలు కొడుకు ఇమాంసాబ్ ఇంటికి వచ్చింది. అయితే ఇంట్లోకి వచ్చేందుకు వీల్లేదని కొడుకు కుటుంబ సభ్యులు తేల్చిచెప్పేశారు. ఈ విషయమై అన్నా చెల్లెలి కుటుంబాల మధ్య వివాదం జరిగింది.

Read Also: కోడలిపై అత్తమామాల అఘాయిత్యం.. మంచానికి కట్టేసి..

తల్లిని చూసుకునే విషయంలో ఇద్దరూ గొడవపడ్డారు. ఆ గొడవ చినికిచినికి దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. ఇమాంసాబ్ తరఫు మనుషులు రాత్రి వేళ చెల్లెలు జంగమా ఇంటిపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో జంగమాతో సహా ఆమె ఇద్దరు కూతుళ్లు, భర్త తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను దేవనహళ్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.