యాప్నగరం

అపార్ట్‌మెంట్‌లో చోరీకి వెళ్లిన దొంగ.. టెర్రస్‌పై మహిళ ఒంటరిగా కనపడడంతో..

టెర్రస్‌పై ఒంటరిగా నిద్రిస్తున్న మహిళపై అత్యాచారానికి యత్నించాడు. తలపై కత్తిపెట్టి రేప్ చేసేందుకు ప్రయత్నించడంతో బెదిరిపోయిన మహిళ పెద్దగా కేకలు వేసింది.

Samayam Telugu 12 Apr 2020, 11:21 am
చోరీకి వచ్చిన దొంగకి మహిళ ఒంటరిగా కనిపించడంతో అత్యాచార యత్నం చేసిన ఘటన వెలుగుచూసింది. చెన్నైలోని అన్నానగర్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో చోరీకి వచ్చి దుండగుడు మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అపార్ట్‌మెంట్ టెర్రస్‌పై ఉన్న గదిలో మహిళ ఒంటరిగా నిద్రిస్తుండడంతో అత్యాచారానికి యత్నించాడు. ఆమె తలపై కత్తిపెట్టి రేప్ చేసేందుకు ప్రయత్నించాడు.
Samayam Telugu rape.


బెదిరిపోయిన మహిళ పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే మహిళ భర్తతో కలసి తిరుమంగళం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అపార్ట్‌మెంట్ పరిధిలోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితుడిని అమింజికరై ప్రాంతానికి చెందిన రామకృష్ణన్‌గా గుర్తించి అరెస్టు చేశారు.

Also Read:
గొంతులు కోసే గాలిపటాలు.. లాక్‌డౌన్‌తో మళ్లీ తెరపైకి..

దొంగతనానికి వచ్చిన రామకృష్ణన్‌ మహిళ ఒంటరిగా కనపడడంతో అత్యాచార యత్నం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్నానగర్ ప్రాంతంలో పగలు పాలు పోసే వ్యక్తిలా తిరుగుతూ రాత్రిళ్లు చోరీలకు పాల్పడుతుంటాడని.. అతనిపై అన్నానగర్ పరిధిలో పలు కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

Read Also: చెరుకుతోటలో గర్భిణి శవం.. బట్టలు చించేసి రేప్‌ డ్రామా.. హంతకుడిని పట్టించిన హ్యాండ్‌రైటింగ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.