యాప్నగరం

మహిళ కారు రివర్స్‌ బీభత్సం.. షాకింగ్ ఘటన

కారు రివర్స్‌లో దూసుకొచ్చింది. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులపైకి దూసుకెళ్లింది. రివర్స్ చేయబోయిన మహిళ కారును కంట్రోల్ చేయలేకపోవడంతో ప్రమాదం జరిగింది.

Samayam Telugu 18 Dec 2020, 11:41 am
మహిళ కారు రివర్స్ చేస్తూ బీభత్సం సృష్టించిన షాకింగ్ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. కారును వెనక్కి తీస్తూ అమాంతం పిల్లలపైకి దూసుకెళ్లడంతో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పాతబస్తీలో జరిగిన ఈ కారు ప్రమాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దుబాయ్ నుంచి ఇటీవలే నగరానికి వచ్చిన మహిళ తన కారును రివర్స్ చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా యాక్సిలరేటర్ బలంగా తొక్కడంతో కారు అదుపుతప్పి వెనక్కి దూసుకెళ్లింది.
Samayam Telugu వెనక్కి దూసుకెళ్లిన కారు
car accident


అదే సమయంలో ఇద్దరు చిన్నారులు ఇంటి బయట ఆడుకుంటున్నారు. ఒక్కసారి కారు బలంగా వచ్చి ఢీకొనడంతో రెండేళ్ల బాలుడి పరిస్థితి విషమంగా మారింది. బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. మరోవైపు కారు నడిపిన మహిళపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:
ఉద్యోగం వచ్చిందని కంపెనీ నుంచి ఫోన్.. మరొకరికి ఇవ్వమన్న ఇంజనీర్.. విషాదం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.