యాప్నగరం

చిలీ యువతికి వరకట్న వేధింపులు.. హైదరాబాదీపై కేసు నమోదు

చిలీ దేశానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న హైదరాబాద్‌ యువకుడు విక్రం ఆమెను కట్నం తీసుకురావాలంటూ వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Samayam Telugu 26 Jan 2020, 11:47 am
విదేశీ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వరకట్న వేధింపులకు గురిచేస్తున్న హైదరాబాద్ యువకుడిపై బెంగళూరులో కేసు నమోదైంది. చిలీకి చెందిన యువతి తన భర్తపై బెంగళూరులోని బసవనగుడి మహిళా పోలీసు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
Samayam Telugu 25BNG258


Also Read: 13ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన పదేళ్ల పిల్లాడు

చిలీ దేశానికి చెందిన మహిళ 2017లో శాస్త్రీయ నృత్యం నేర్చుకునేందుకు బెంగళూరు నగరానికి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమెకు హైదరాబాద్‌‌కు చెందిన వాసివిక్రం మాడ అనే యువకుడు పరిచయమయ్యాడు. అది కాస్త ప్రేమగా మారి ఏడాది తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం జేపీనగర పుట్టనహళ్లిలో నివాసం ఉంటున్నారు. గతేడాది ఆ మహిళ స్వదేశానికి వెళ్లి వచ్చింది. అప్పటి నుంచి ఆమెకు కట్నం వేధింపులు మొదలయ్యాయి. కట్నం తీసుకొస్తేనే కాపురం చేస్తానని, లేకపోతే విడాకులు ఇచ్చేస్తానని విక్రం వేధించసాగాడు.

Also Read: పబ్జీకి మరో ప్రాణం బలి.. తల్లిదండ్రులు తిట్టారని ఉరేసుకున్న టెన్త్ విద్యార్థి

కొద్దిరోజుల పాటు అతడి వేధింపులు భరించిన బాధితురాలు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని, రోజూ తన సెల్‌ఫోన్ చెక్ చేస్తాడని, ఎవరితో మాట్లాడానో పరిశీలించి చిత్రహింసలు పెడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. భర్త వేధింపుల నుంచి తనకు విముక్తి కల్పించాలని పోలీసులను వేడుకుంది. దీంతో వారు విక్రంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: పొలానికి వెళ్లిన మహిళను చంపి తినేసిన పులి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.