యాప్నగరం

గుంటూరు జిల్లాలో భారీ దోపిడీ.. రూ.90 లక్షలు చోరీ, దొంగల అతి తెలివితో

బ్యాంక్ వెనుక వైపు గ్రిల్‌ను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి లోపలకు చొరబడ్డారు. సీసీ కెమెరాలు కూడా ఆపేసి దొంగతనానికి పాల్పడ్డారు. రూ. 90 లక్షలు దోచుకెళ్లారు.

Samayam Telugu 21 Nov 2020, 11:39 am
గుంటూరు జిల్లాలో భారీ దోపిడీ జరిగింది. దాచేపల్లి నడికుడిలో ఒక బ్యాంకులో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దోపిడీ దొంగలు వెనుక వైపు గ్రిల్‌ను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి లోపలకు చొరబడ్డారు. సీసీ కెమెరాలు కూడా ఆపేసి దొంగతనానికి పాల్పడ్డారు. రూ. 90 లక్షలు దోచుకెళ్లారు. తెల్లవారిన తర్వాత బ్యాంకు ఉద్యోగులు బ్యాంకుకు వచ్చి చూసే సరికి బ్యాంకులో దోపిడీ జరిగినట్లుగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు.
Samayam Telugu గుంటూరు జిల్లాలో భారీ దోపిడీ


సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాంక్ పరిసరప్రాంతాలను, దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఇది బ్యాంకులో ఉన్న వ్యక్తుల పనా లేక బయట వ్యక్తులు చేసిన పనా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.. నిన్నే మాచర్ల బ్రాంచ్ నుంచి నారాయణపురం బ్యాంక్ బ్రాంచ్‌కు డబ్బులు తరలించారు. భారీ చోరీ కావడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.