యాప్నగరం

ఆరో తరగతి బాలికతో ఆర్టీసీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. బస్సులో రోజూ వేధింపులు

Srikalahasti Driver: పేద కుటుంబానికి చెందిన అమ్మాయి. బడికి వెళ్లాలంటే ఆర్టీసీ బస్సే దిక్కు. అలాంటి అమ్మాయిపై ఆర్టీసీ డ్రైవర్ కన్ను పడింది. మనవరాలి వయసుంటే ఆ అమ్మాయిని వేధిస్తున్నాడు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. ఆ వేధింపులు భరించలేక అమ్మాయి నాలుగు రోజులు స్కూల్‌కి వెళ్లడం మానేసింది. ఇంట్లో తల్లిదండ్రులు బడికి వెళ్లాలని ఒత్తిడి చేయడంతో ఏం చేయాలో తెలియక ఏడుపు అందుకుంది. శ్రీకాళహస్తిలోని బుచ్చినాయుడు కండ్రిగలో చోటుచేసుకున్న ఘటన వివరాలు..

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 1 Apr 2023, 3:47 pm

ప్రధానాంశాలు:

  • ఆరో తరగతి చదువుతున్న బాలికతో ఆర్టీసీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన.
  • తల్లిదండ్రులకు చెప్పుకోలేక, బడికి వెళ్లలేక కుమిలిపోయిన అమ్మాయి.
  • శ్రీకాళహస్తి పరిధిలోని బి.కండ్రిగలో ఘటన..
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Harassment
ప్రతీకాత్మక చిత్రం
ఆడపిల్లలను బయటికి పంపించాలంటేనే తల్లిదండ్రులు వణికిపోయే పరిస్థితి ఉంది. ఆరో తరగతి చదువుతున్న ఓ బాలికను ఆమెకు తాత వయసుండే ఓ ఆర్టీసీ డ్రైవర్ వేధింపులకు గురిచేస్తున్నాడు. బస్సులో ప్రయాణించే సమయంలో బాలికతో వెకిలి వేషాలు వేస్తూ.. అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అమ్మాయికి బలవంతంగా ముద్దులు పెట్టి, అసభ్యంగా ప్రవర్తించి.. వాటిని ఫోటోలు తీశాడు. ఆ తర్వాత.. ఆ ఫోటోలు చూపిస్తే అందరూ ఆమెనే తిడతారని చెప్పి బెదిరింపులకు గురిచేస్తూ లైంగికంగా వేధిస్తున్నాడు. అభంశుభం తెలియని ఆ బాలిక.. ఆ వేధింపులు భరించలేక చివరికి తన తల్లికి తన గోడు చెప్పుకొని బోరుమంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పరిధిలోని బుచ్చినాయుడు కండ్రిగలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
బుచ్చినాయుడు కండ్రిగలో ఆరో తరగతి చదువుతున్న బాలిక స్కూలుకు వెళ్లే క్రమంలో రోజూ శ్రీకాళహస్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తోంది. బస్సు డ్రైవర్ శ్రీనివాసులు (46 ఏళ్లు) గత కొన్ని రోజులుగా ఆ బాలికను వేధిస్తున్నాడు. మొదట్లో బాలిక భయపడి ఆ బాధను ఎవ్వరికీ చెప్పుకోలేదు. ఆ భయంతో నాలుగైదు రోజులు స్కూలుకు కూడా వెళ్లలేదు. స్కూల్‌కి వెళ్లాలని తల్లిదండ్రులు హెచ్చరించడంతో ఏం చేయాలో తెలియక తనలో తానే కుమిలిపోయింది. రోజురోజుకూ వేధింపులు తీవ్రం కావడంతో చివరికి ధైర్యం చేసి తన బాధను తల్లిదండ్రులకు చెప్పుకుంది.

డ్రైవర్‌ను చితకబాదుతున్న బాలిక బంధువులు


అసలు విషయం తెలిశాక తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. స్థానికులు, జనసేన కార్యకర్తలతో కలిసి, ఆర్టీసీ డ్రైవర్‌ను పట్టుకొని చితకబాదారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఇలాంటి డ్రైవర్లుంటే.. ఆడపిల్లలను బస్సుల్లో ఎలా పంపించాలని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.