యాప్నగరం

కీచక లెక్చరర్.. ప్రేమించడం లేదని యువతి ఫోటోలు న్యూడ్‌గా మార్ఫింగ్ చేసి

తాను గతంలో పనిచేసిన కాలేజీలో స్టూడెంట్‌ పరిచయంపెంచుకున్న హరీశ్‌కుమార్ ఆమెతో తరుచూ ఫోన్లో మాట్లాడేవాడు. ఈ క్రమంలోనే తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో ఆమెపై కక్షగట్టి వేధించడం మొదలుపెట్టాడు.

Samayam Telugu 17 May 2020, 9:58 am
తాను పనిచేసే కాలేజీలో చదువుతున్న యువతికి అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తున్న కీచక లెక్చరర్‌ను హైదరాబాద్ రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్‌ జిల్లా గంగాధర సమీపంలోని అచ్చంపల్లికి చెందిన కోలా హరీష్‌కుమార్‌(26) ఉప్పల్‌లోని విజయపురి కాలనీలో ఉంటున్నాడు. 2017లో ఘట్‌కేసర్‌లోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తూ అక్కడే ఎంటెక్‌ చదువుతున్న ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు.
Samayam Telugu Image


Also Read: అఫైర్ బయటపడిందని జంట ఆత్మహత్య.. కామారెడ్డి జిల్లాలో కలకలం

తరుచూ ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ కొద్దిరోజుల తర్వాత ప్రేమిస్తున్నానంటూ వేధించడం మొదలుపెట్టాడు. తనకిష్టం లేదని ఆమె చెప్పడంతో కక్ష పెంచుకున్నాడు. దీంతో ఆమెకు తరుచూ వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు, ఫోటోలు పంపిస్తూ తీవ్రంగా వేధించసాగాడు. ఫోటోలను నగ్నంగా మార్ఫింగ్ చేసి ఆమె కుటుంబసభ్యులకు పంపించాడు. అతడి వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ సిగ్నల్స్ ద్వారా నిందితుడిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: టీడీపీ నేతపై రేప్ కేసు.. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.