యాప్నగరం

మహిళా లెక్చరర్‌పై కాలేజీ మేనేజర్‌ కొడుకు అఘాయిత్యం.. అవమాన భారంతో

గురువారం కాలేజీ ఇంటికి వస్తున్న లేడీ లెక్చరర్‌పై ఓ మెడికల్ కాలేజీ మేనేజర్ కొడుకు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె అతడి బారి నుంచి తప్పించుకుని పారిపోయి ఇంటికి చేరుకుంది. అవమానభారం తట్టుకోలేక విషం తాగేసింది.

Samayam Telugu 25 Feb 2020, 4:28 pm
ఉత్తర్‌ప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలకు అడ్డే లేకుండా పోతోంది. తాజాగా మహారాజ్‌గంజ్ జిల్లాలో ఓ మహిళా లెక్చరర్‌పై కాలేజీ మేనేజర్ కొడుకు అత్యాచారానికి యత్నించాడు. అతడి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు అవమానం భరించలేక విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.
Samayam Telugu rape1


Also Read: టిక్‌టాక్‌లో హాట్‌హాట్ వీడియోలు, యువకులతో బూతుపురాణం.. అమర సైనికుడి భార్యను ఛీకొడుతున్న గ్రామస్థులు

మహారాజ్‌గంజ్ జిల్లాలోని నతన్వా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ప్రాంతానికి చెందిన యువతి ప్రైవేట్ ఇంటర్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. గురువారం ఇంటికి ఆలస్యంగా వచ్చిన యువతి భోజనం చేసిన తర్వాత విషం తాగేసింది. ఆమెను గమనించిన కుటుంబసభ్యులు వెంటనే రతన్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో గోరఖ్‌పూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు కోల్పోయింది.

Also Read: ప్రాణం తీసిన టిక్‌టాక్.. ‘భద్రాచలం’ సినిమా ఫీట్ చేయబోయి చెరువులో శవమై తేలిన యువకుడు

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు యువతి కుటుంబసభ్యులను విచారించగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. యువతిపై కన్నేసిన అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఓ టీచర్‌తో కలిసి ఆమెపై గురువారం అఘాయిత్యానికి ప్రయత్నించినట్లు మృతురాలి తండ్రి పోలీసులకు చెప్పాడు. నిందితుడి తండ్రి మెడికల్ కాలేజీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడని, చాలా రోజులుగా తన కూతురిని లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు పేర్కొన్నాడు.

Also Read: యూపీలో మరో ఘోరం.. యువతిపై కాబోయే భర్త స్నేహితుల గ్యాంగ్ రేప్

గురువారం సాయంత్రం ఇంటికొస్తున్న సమయంలో ఆమెను అడ్డగించిన యువకుడు అత్యాచారం చేసేందుకు యత్నించాడని, వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న ఆమె అవమానభారంతో విషం తాగేసిందని పోలీసులకు తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Also Read: గుంటూరులో కీచక మామ... కోరిక తీర్చాలంటూ కోడలికి వేధింపులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.