యాప్నగరం

డ్రైవర్‌కి ఫిట్స్.. మేడ్చల్‌లో కంటైనర్ లారీ బీభత్సం

జాతీయ రహదారిపై వెళ్తుండగా డ్రైవర్‌కి ఫిట్స్ రావడంతో కంటైనర్ లారీ అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. నిలిపి ఉంచిన వాహనాలను ఢీకొడుతూ ఈడ్చుకెళ్లింది.

Samayam Telugu 25 Oct 2020, 5:26 pm
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. ఢ్రైవర్‌కి ఫిట్స్ రావడంతో లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టి దూసుకెళ్లింది. ఈ షాకింగ్ ఘటన మేడ్చల్ ప్రధాన రహదారిపై జరిగింది. హైదరాబాద్ నుంచి హర్యానా వెళ్తున్న కంటైనర్ లారీ స్థానిక ప్రియదర్శిని, సంతోష్ హోటల్ ముందు పార్క్ చేసిన వాహనాలను కంటైనర్ లారీ ఢీకొట్టింది. లారీ డ్రైవర్‌కి ఫిట్స్ రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారును ఢీకొట్టిన లారీ.. అనంతరం పక్కనే నిలిపి ఉంచిన మిని వ్యాన్‌ని ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ సమయంలో వాహనాల్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు.
Samayam Telugu ఆగి ఉన్న కార్లను ఢీకొట్టిన లారీ
accident


Also Read: ఆడపడుచుని అమ్మేసిన వదిన.. ప్రకాశంలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.