యాప్నగరం

ఆకలి భయంతో ఆత్మహత్య చేసుకుందామని.. పెద్దాపురంలో విషాద ఘటన

కరోనా నిషేధాజ్ఞలతో సామాన్యుల పరిస్థితి దినదినగండంగా మారుతోంది. భర్త పనికి వెళ్లకపోవడంతో పస్తులుండాల్సిన పరిస్థితులను తలచుకుని ఓ భార్య ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటుచేసుకుంది.

Samayam Telugu 29 Mar 2020, 6:25 pm
కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించి నిషేధాజ్ఞలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజలెవరూ బయటికి రావొద్దని.. ఇళ్లలోనే ఉండాలని చెబుతున్నాయి. అయితే ఆ ప్రభావం సామాన్యులు, రోజువారీ కూలీలపై తీవ్రంగా ఉంటోంది. రోజుల తరబడి పనులకు వెళ్లకపోతే బతుకుబండి ఉలా నడుస్తుందన్న ఆందోళన చెందుతున్నారు.
Samayam Telugu lady


తన భర్త వారం రోజులుగా పనికి వెళ్లకపోవడంతో పస్తులు ఉండాల్సి వస్తుందేమోనన్న భయంతో భార్య ఆత్మహత్యాయత్నం చేసిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. పెద్దాపురం పట్టణంలోని వరహాలయ్యపేటకి చెందిన లక్ష్మి, తన భర్తతో కలసి ఉంటోంది. లాక్‌డౌన్ కారణంగా వారం రోజులుగా లక్ష్మి భర్త పనికి వెళ్లకపోవడంతో కుటుంబం అవస్థలు పడుతోంది.

Also Read: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి.. ఐదుగురికి గాయాలు

మరికొద్ది రోజులు ఇలానే ఉంటే తిండికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని.. పస్తులు పడుకోవాల్సిందేనన్న మనస్థాపం చెందిన లక్ష్మి చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గమనించిన కుటుంబ సభ్యులు లక్ష్మిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమెని ఇంటికి పంపించినట్లు సమాచారం.

Read Also: పెళ్లికొడుకు తలపై గన్, చేతిలో తాళి.. ఎదురుగా అమ్మాయి.. చివరికి అదిరిపోయే ట్విస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.