యాప్నగరం

బ్యూటీపార్లర్‌ ముసుగులో వ్యభిచారం.. భార్యభర్తల అరెస్ట్, ఐదుగురు సెక్స్‌వర్కర్లకు విముక్తి

బ్యూటీపార్లర్ ముసుగులో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న భార్యభర్తలను పుదుచ్చేరి పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి ఐదుగురు మహిళలకు విముక్తి కల్పించారు.

Samayam Telugu 9 Mar 2020, 8:26 pm
తక్కువ సమయంలోనే అధికంగా సంపాదించాలన్న ఆశతో భార్యభర్తలు నీచానికి పాల్పడ్డారు. మైనర్ బాలికలకు వలవేసి వ్యభిచారంలోకి దించి సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారు. బ్యూటీ పార్లర్ ముసుగులో కొనసాగుతున్న వ్యభిచారం కేంద్రాన్ని పోలీసులు పట్టుకున్నారు. మైనర్‌ బాలిక సహా పలువురు మహిళలను రక్షించి పునరావాస కేంద్రానికి తరలించారు. దంపతులతో పాటు ఓ విటుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
Samayam Telugu couple operates prostitution racket in puducherry under garb of beauty parlour arrested
బ్యూటీపార్లర్‌ ముసుగులో వ్యభిచారం.. భార్యభర్తల అరెస్ట్, ఐదుగురు సెక్స్‌వర్కర్లకు విముక్తి


​పైకి బ్యూటీ పార్లర్.. లోపలేమో గలీజు పనులు

పుదుచ్చేరిలోని ముదలియార్‌పేట్‌లో భార్యభర్తలు ఓ బ్యూటీ పార్లర్‌ను నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆ పార్లర్‌కు యువకుల తాకిడి పెరగడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో దానికి కొద్దిరోజులుగా నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో శుక్రవారం అక్కడ రైడ్ చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

​మైనర్‌తో వ్యభిచారం..

బ్యూటీపార్లర్‌లో మైనర్ బాలికతో పాటు తమిళనాడుకు చెందిన నలుగురు మహిళలను పోలీసులు గుర్తించారు. ఈ దంపతులు ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. ఐదుగురు సెక్స్‌వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. దంపతులతో పాటు రైడింగ్‌లో పట్టుబడిన ఓ విటుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రాంతీయ రవాణా కార్యాలయం సమీపంలోనే ఈ బ్యూటీపార్లర్‌ను నిర్వహిస్తుండటంతో అధికారులు ఉలిక్కిపడ్డారు.

​దంపతుల అరెస్ట్..

సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న దంపతులను జయచంద్రన్(41), వనిశ్రీ(43)గా పోలీసులు గుర్తించారు. వీరు సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. బాలికతో పాటు నలుగురు మహిళలను బలవంతంగా తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు వారిపై వివిధ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: గొంతును చీల్చి వ్యక్తి దారుణ హత్య.. అన్న ఆత్మే చంపిందంటున్న స్థానికులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.