యాప్నగరం

కన్నవారి కర్కశత్వం.. అప్పుల బాధతో పిల్లలను చెరువులోకి తోసేసిన దంపతులు

అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న దంపతులు తమ పిల్లలను చెరువులోకి తోసేశారు. అనంతరం ధైర్యం చాలక వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

Samayam Telugu 13 Aug 2020, 9:33 am
సరైన ఉపాధి లేక అప్పుల పాలైన దంపతులు ఇద్దరు కన్నబిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. అందరూ కలిసి చెరువు వద్దకు వెళ్లారు. దంపతులు ముందుగా బిడ్డను చెరువులో తోసేశారు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకునేందుకు ధైర్యం చాలక ఆ నిర్ణయం విరమించుకున్నారు. కానీ క్షణికావేశంలో వారు చేసిన పని ఇద్దరు ముక్కపచ్చలారని చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో జరిగింది.
Samayam Telugu పిల్లలతో నందిని(ఫైల్ ఫోటో)


Also Read: పెళ్లయిన మూడు నెలలకే ఆటోడ్రైవర్ ఆత్మహత్య.. భార్య పుట్టింటి నుంచి వచ్చేలోపే

కూడ్లిగి తాలూకా మల్లనాయకనహళ్లికి చెందిన చిరంజీవికి భార్య నందిని కూతురు ఖుషి (3), కొడుకు చిరు(1) ఉన్నారు. కొన్నాళ్లుగా సరైన ఉపాధి లేకపోవడంతో ఆ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో భార్యభర్తలు తరుచూ గొడవలు పడుతున్నారు. ఈ కారణంతోనే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం సాయంత్రం నలుగురు కలిసి బైక్‌పై బయలుదేరి గుడేకోట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామదుర్గ చెరువు వద్దకు చేరుకున్నారు.

Also Read: భర్త చిత్రహింసలు భరించలేక.. ముగ్గురు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్యాయత్నం

ముందు పిల్లలిద్దరినీ చెరువులోకి తోసేసిన చిరంజీవి, నందిని ఆ తర్వాత వారు కూడా దూకేందుకు సిద్ధమయ్యారు. ఆఖరి క్షణంలో వారికి ధైర్యం చాలక ఆత్మహత్య ప్రయత్నం విరమించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు స్థానికులకు సమాచారం ఇవ్వడంతో గజ ఈతగాళ్ల సాయంతో పిల్లల కోసం గాలించారు. బుధవారం ఉదయం ఖుషీ, చిరు మృతదేహాలను వెలికి తీశారు. దంపతులపై కేసు నమోదు చేసి గుడేకోట పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణం తీసిన ఆ దంపతులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: ఆస్తి కోసం కన్నకొడుకునే సుత్తితో మోది హత్య... విశాఖలో ఓ తండ్రి ఘాతుకం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.