యాప్నగరం

కేసు పెట్టని ఎస్సైపైనే కేసు.. షాకిచ్చిన కోర్టు

పోలీస్ స్టేషన్‌కి వెళ్తే న్యాయం జరగకపోగా తనపైనే అక్రమ కేసులు పెట్టారంటూ ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో ఎస్సైపై కేసు నమోదైంది.

Samayam Telugu 13 Dec 2020, 1:56 pm
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. అతని ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు నిరాకరించారు. అంతటితో ఆగకుండా బెదిరింపులకు దిగి తనపైనే అక్రమ కేసు నమోదు చేశారంటూ బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. సీరియస్‌గా పరిగణించిన న్యాయస్థానం ఎస్సైకి షాకిచ్చింది. అతనిపై.. అదే స్టేషన్‌లో కేసు నమోదు చేయాలంటూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎస్సైపై కేసు నమోదైంది. ఈ ఘటన జనగాం జిల్లా రఘునాథపల్లిలో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
law


రఘునాథపల్లి ఎస్సై తనపై అక్రమ కేసు బనాయించారంటూ కంచనపల్లి గ్రామానికి చెందిన రామ్మూర్తి న్యాయస్థానాన్ని, మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కి వెళ్తే ఫిర్యాదును తిరస్కరించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తనపై అక్రమ కేసు పెట్టారని కోర్టుకు తెలియజేశారు. సీరియస్‌గా పరిగణించిన న్యాయస్థానం రఘునాథపల్లి ఎస్సైపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎస్సై అశోక్ సహా మరో 11 మందిపై అదే పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడం గమనార్హం.

Also Read: బ్రిడ్జిపై ఆగిన ట్రాఫిక్.. కార్లని గుద్దుకుంటూ పోయిన లారీ.. ఘోరం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.