యాప్నగరం

లాక్‌డౌన్‌‌తో తెలంగాణలో షాకింగ్ రిజల్స్ట్.. సగానికి పడిపోయిన క్రైమ్ రేట్

రాష్ట్రంలో మార్చి 1 నుంచి 21 వరకూ 48 హత్య కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్ ప్రకటించిన తరువాత 12 మర్డర్ కేసులు నమోదు కాగా.. దొంగతనాలు సుమారు 94 శాతం తగ్గడం విశేషం.

Samayam Telugu 9 Apr 2020, 3:02 pm
కరోనా లాక్‌డౌన్‌తో తెలంగాణలో షాకింగ్ రిజల్స్ట్ నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నేరాల సంఖ్య భారీగా తగ్గిపోయింది. లాక్ డౌన్ అమలుతో క్రైమ్ రేట్ దాదాపు సగానికి పడిపోయింది. లాక్ డౌన్ ప్రారంభమైన మార్చి 22 నుంచి ఇప్పటి వరకు మర్డర్లు, అత్యాచారాల వంటి తీవ్ర నేరాలు, దొంగతనాలు, మిస్సింగ్ కేసులు గణనీయంగా పడిపోయాయి. అయితే వాటి స్థానంలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై పెట్టిన కేసులు మాత్రం 98 శాతం పెరగడం గమనార్హం.
Samayam Telugu arrest


లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి నేటి వరకు తెలంగాణలో క్రైమ్ రేట్ 56 శాతానికి పడిపోయింది. మార్చి 1 నుంచి మార్చి 21 మధ్య తెలంగాణలో 48 హత్య కేసులు నమోదుకాగా.. మార్చి 22 నుంచి ఇప్పటి వరకూ 12 మర్డర్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ లాక్‌డౌన్ సమయంలో హైదరాబాద్ , ఆదిలాబాద్ , సూర్యాపేట్‌ జిల్లాల్లో ఎక్కువగా నేరాలు నమోదైనట్లు పోలీసు శాఖ గుర్తించింది.

Also Read: హత్యా? ఆత్మహత్యా? అపార్ట్‌మెంట్‌ పైనుంచి పడి యువతి..

రాష్ట్రంలో దొంగతనాలు భారీగా తగ్గాయి. చోరీ కేసులు సుమారు 94 శాతం పడిపోవడమే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. కిడ్నాప్ కేసులు 90 శాతం, మిస్సింగ్ కేసులు 75 శాతం మేర తగ్గాయి. అయితే లాక్‌డౌన్ కేసులు మాత్రం భారగా పెరిగాయి. నిబంధనలు ఉల్లంఘించి బయటికొచ్చిన వారిపై నమోదైన కేసులు 98 శాతం పెరిగాయి.

Read Also: నలుగురి నరబలి.. కన్నతల్లినీ వేటాడి.. క్షుద్రపూజల పేరుతో ఉన్మాది మారణహోమం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.