యాప్నగరం

Karnataka: బాలుడిని ఈడ్చుకెళ్లి... స్తంభానికి కట్టేసి కొట్టారు.. అడ్డుకున్న తల్లిని...

ర్ణాటకలో (Karnataka) ఘోరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా చింతామణి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది దళిత బాలుడిపై విరుచుకుపడ్డారు. కేవలం ఇయర్ రింగ్స్ కోసం 14 ఏళ్ల బాలుడిని ఈడ్చుకెళ్లి.. స్తంభానికి కట్టేసి కొట్టారు. బాలిక బంగారపు చెవిపోగులు పోవడంతో.. ఆ అబ్బాయే దొంగతనం చేశాడని భావించి.. ఇంత ఘాతుకానికి పాల్పడ్డారు. అడ్డుకున్న తల్లిని కూడా చితకబాదారు. దాంతో వారిద్దరూ ఆస్పత్రి పాలయ్యారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 1 Oct 2022, 4:00 pm

ప్రధానాంశాలు:

  • కర్ణాటకలో దారుణమైన ఘటన
  • దళిత బాలుడిపై విరుచుకుపడ్డ జనం
  • పది మందిపై కేసు పెట్టిన పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతికాత్మక చిత్రం
కర్ణాటకలో (Karnataka) ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. కొంతమంది దళిత బాలుడి (14) పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. చోరీ చేశాడనే అనుమానంతో.. బాలుడిని స్తంభానికి కట్టేసి... చితక బాదారు. చింతామణి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీసులు పది మందిపై కేసు నమోదు చేశామని శనివారం వెల్లడించారు. బాలుడు దొంగతనానికి పాల్పడ్డాడనే అనుమానిస్తూ అగ్రవర్ణానికి చెందిన వ్యక్తులు.. ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు.
కెంపదేనహళ్లిలో నివాసముంటున్న యశ్వంత్ తన తోటి స్నేహితులైన ఇతర అబ్బాయిలు, అమ్మాయిలతో ఆడుకున్నాడు. అయితే అందులో అగ్ర సామాజిక వర్గానికి చెందిన ఓ బాలిక గోల్డ్ ఇయర్ రింగ్స్ కనిపించకుండా పోయాయి. దాంతో వాటిని యశ్వంతే దొంగతనం చేసేశాడని కొంతమంది అనుమానించారు. వెంటనే యశ్వంత్‌ని ఈడ్చుకెళ్లి విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు. తన కొడుకుని కాపాడుకునేందుకు వచ్చిన.. యశ్వంత్ తల్లిని కూడా కొట్టారు. వారి కొట్టిన దెబ్బలకు యశ్వంత్, అతని తల్లి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటన గురువారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దాంతో వెంటనే పోలీసులు పదిమందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చింతామణి రూరల్ పోలీసులు బాధిత బాలుడు, అతని తల్లి వాంగ్మూలాలను తీసుకున్నారు. కాగా ఈ మధ్యకాలంలోనే కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. హిందూ దేవుడి విగ్రహాన్ని తాకినందుకు దళిత బాలుడి కుటుంబానికి గ్రామ పెద్దలు రూ.60,000 జరిమానా విధించారు. అంత డబ్బు తమ దగ్గర లేదని.. కాళ్లా, వేళ్లా పడినా పట్టించుకోలేదు. డబ్బు చెల్లించాల్సిందేనని అన్నారు. దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.