యాప్నగరం

ఎమ్మెల్యే వేధింపులు.. ఉరేసుకుని ప్రముఖ డాక్టర్ ఆత్మహత్య

ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ వేధింపులతో డాక్టర్ రాజేంద్ర సింగ్ శనివారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు దీంతో పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.

Samayam Telugu 19 Apr 2020, 9:39 am
దేశ రాజధాని ఢిల్లీలో డాక్టర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. అధికార పార్టీ ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ వేధింపులు తాళలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆయన రెండు పేజీల సూసైడ్‌ నోట్‌ రాశారు. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్ర సింగ్ అనే డాక్టర్ ఢిల్లీలోని నెబ్ సారాయ్ ప్రాంతంలో నివాసముంటున్నారు. వైద్య వృత్తితో పాటు ఆయన వాటర్ ట్యాంకర్ల వ్యాపారం చేస్తున్నారు. నీళ్లు కావాల్సిన వారికి ఆయన వాటర్ ట్యాంకర్ల ఢిల్లీ జలమండలి నుంచి నీటిని సేకరించి అందించేవి.
Samayam Telugu hang suicide


Also Read: పుట్టింట్లో ఇరుక్కుపోయిన భార్య.. కోపంతో మాజీ ప్రియురాలిని పెళ్లాడిన భర్త

కొన్నా్ళ్లుగా ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ ఆయన్ని డబ్బుల కోసం వేధిస్తున్నాడు. తనకు కమిషన్ ఇవ్వకపోతే నీళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటానని బెదిరిస్తున్నాడు. ఎమ్మెల్యే వేధింపులు భరించలేకపోయిన ఆయన శనివారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఓ డైరీ, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నాడు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు తనను వేధించిన తీరును డాక్టర్ సూసైడ్‌ నోట్‌లో వివరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్‌ తీరుపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. 2018లో మహిళలను బెదిరించిన ఘటనలో ఆయన మీద కేసు నమోదైంది. ఇప్పుడు డాక్టర్ ఆత్మహత్యతో మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు.

Also Read: ఆంటీపై పక్కింటి వ్యక్తి ఆకర్షణ.. ఇద్దరూ కలిసి పరార్... చివరికి ఆమె భర్త చేతిలో

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.