యాప్నగరం

వదినతో ఆ సంబంధం.. కాపురం పెడదామని మరిదిని అడగడంతో..!

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. వదినను మరిది అంతమొందించాడు.

Samayam Telugu 11 Nov 2020, 10:32 pm
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. క‌లిసి కాపురం పెడదామని వేధిస్తోందంటూ ఓ మ‌రిది త‌న‌ వ‌దినను దారుణంగా అంతమొందించాడు. హత్య చేసిన తర్వాత పోలీస్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఢిల్లీలోని క‌ర‌వాల్ ఏరియాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని క‌ర‌వాల్ న‌గ‌ర్‌కు చెందిన రోహిత్ త‌న‌ త‌ల్లి, అన్నా, వ‌దిన, వారి ఇద్దరు పిల్లలతో క‌లిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే మూడేళ్ల క్రితం రోహిత్ సోద‌రుడు ఆత్మహ‌త్య చేసుకున్నాడు. అనం‌త‌రం రోహిత్‌తో సహా అందరూ ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇదే క్రమంలో వ‌దినతో రోహిత్‌కు వివాహేత‌ర సంబంధం ఏర్పడింది. రెండేళ్లు బాగానే ఉన్నా ఇటీవ‌ల ఇద్దరి మ‌ధ్య గొడ‌వ‌లు మొదలయ్యాయి. త‌ల్లిని వ‌దిలేసి తాను, పిల్లలతో వేరు కాపురం పెట్టాల‌ని రోహిత్‌పై ఆమె ఒత్తిడి తీసుకొచ్చింది.

ఇదే క్రమంలో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఇద్దరి మ‌ధ్య గొడ‌వ తారాస్థాయికి చేరుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన రోహిత్‌ వదిన గొంతు నులిమి చంపేశాడు. అనంతరం నిందితుడు నేరుగా పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని శ‌వాన్ని పోస్టుమార్టం నిమిత్తం త‌ర‌లించారు. కాగా, హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలో బాధితురాలి కూతురు బంధువుల ఇంటికి వెళ్లగా, కొడుకు ఇంటి బ‌య‌టే ఆడుకుంటున్నాడ‌ని నిందితుడు రోహిత్ చెప్పిన‌ట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టామని పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.