యాప్నగరం

‘దిశ’ కేసు ప్రధాన నిందితుడికి అస్వస్థత.. జైల్లోనే వైద్యసేవలు

మరో నిందితుడు కిడ్నీ సమస్యతో బాధపడుతుండటంతో అతడికీ వైద్యం అందిస్తున్నట్లు జైలు వర్గాలు చెబుతున్నాయి. నలుగురు నిందితులు తమ గదులు దాటి బయటకు రాకుండా నిత్యం సిబ్బంది పహారా కాస్తున్నారు.

Samayam Telugu 4 Dec 2019, 9:36 am
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ హత్యాచారం ఘటనలో నలుగురు నిందితులు ప్రస్తుతం చర్లపల్లిలో జైలులో ఉన్నారు. వారిని తమ కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై షాద్‌నగర్ న్యాయస్థానం ఈరోజు విచారణ జరపనుంది. మరోవైపు ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన మహ్మద్ ఆరిఫ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
Samayam Telugu jail


Also Read: ప్రకాశం జిల్లాలో తల్లీకూతుళ్ల దారుణహత్య.. రాళ్లతో కొట్టి సజీవదహనం

చర్లపల్లి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎం.సంపత్ మంగళవారం నిందితుల గదులను పరిశీలించి వారితో మాట్లాడారు. జైల్లో దోమలు ఎక్కువగా ఉండటంతో ఇబ్బంది పడుతున్నామని నిందితులు ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆరిఫ్ అస్వస్థతతో ఉన్నట్లు గుర్తించిన ఆయన డాక్టర్‌తో పరీక్ష చేయించారు. అతడు జ్వరంతో బాధపడుతున్నాడని చెప్పిన డాక్టర్ కొన్ని మందులు వేసుకోమని ఇచ్చారు.

Also Read: ఫ్రెండ్‌తో కలిసి భార్యను రేప్ చేసి జననాంగాలపై వాతలు.. కదిరిలో దారుణం

ఇదే కేసులో మరో నిందితుడు కిడ్నీ సమస్యతో బాధపడుతుండటంతో అతడికీ వైద్యం అందిస్తున్నట్లు జైలు వర్గాలు చెబుతున్నాయి. నలుగురు నిందితులు తమ గదులు దాటి బయటకు రాకుండా నిత్యం సిబ్బంది పహారా కాస్తున్నారు. వారికి టిఫిన్, భోజనం తలుపు కింద నుంచే అందిస్తు్న్నారు. లోపలే బాత్రూమ్ కూడా ఉంది. మరోవైపు నలుగురు కామాంధులను వెంటనే ఉరి తీయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి.

Also Read: విదేశీ మహిళలతో వ్యభిచారం.. ఒక్కరాత్రికే రూ.60వేలట!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.