యాప్నగరం

ఆ మృగాళ్ల శవాలు చూడాలని ఉంది: దిశ తల్లి

మా బిడ్డకు ఇంత తొందరగా న్యాయం జరుగుతుందని ఊహించలేదు. నా కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన ఆ మృగాళ్ల శవాలను చూడాలని ఉంది.. అంటూ దిశ తల్లి అన్నారు.

Samayam Telugu 6 Dec 2019, 12:18 pm
నిర్భయ ఘటన తర్వాత మరోసారి దేశవ్యాప్తంగా అంతటి సంచలనం రేపిన ‘దిశ’ ఘటన నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో తెలంగాణ పోలీసులు హీరోలు అయిపోయారు. మిగతా రాష్ట్రాల పోలీసులు తెలంగాణ పోలీసులను చూసి నేర్చుకోవాలంటూ సోషల్‌మీడియాలో కీర్తిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై దిశ తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురు తిరిగి రాలేకపోయినా నిందితులను కాల్చి చంపడంతో తమకు కాస్త ఉపశమనమైనా కలిగిందని ఆమె తల్లి చెబుతున్నారు.
Samayam Telugu disha


Also Read: ‘నా భర్తను ఎన్‌కౌంటర్ చేసిన చోటే నన్నూ చంపేయండి’.. చెన్నకేశవులు భార్య

‘‘ఏడేళ్లైనా నిర్భయకు న్యాయం జరగలేదు. నా కూతురికి 10 రోజుల్లోనే న్యాయం చేసిన పోలీసులకు ధన్యవాదాలు. నిందితుల ఎన్‌కౌంటర్‌తో మాకు మనశ్శాంతి కలిగింది. ఇంత తొందరగా న్యాయం జరుగుతుందని ఊహించలేదు. నా కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన ఆ మృగాళ్ల శవాలను చూడాలని ఉంది. వాళ్లను చంపినా మా కూతురు లేదన్న బాధ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది’ అని దిశ తల్లి వ్యాఖ్యానించారు.

Also Read: యాధృచ్ఛికం... ‘దిశ’ దశదిన కర్మ రోజే నిందితుల ఎన్‌కౌంటర్

శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ దిశను నవంబర్ 27వ తేదీ రాత్రి షాద్‌నగర్ సమీపంలోన నలుగురు యువకుడు దారుణంగా రేప్ చేసి చంపేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఘటన జరిగిన చటాన్‌పల్లికి తీసుకొచ్చి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఆ సమయంలో నిందితులు పోలీసుల కళ్లుగప్పి పారిపోయేందుకు యత్నించడంతో నలుగురికి కాల్చి చంపారు.

Also Read: ‘దిశ’ కేసు నిందితుల ఎన్‌కౌంటర్.. పదిరోజుల్లో ఏం జరిగిందంటే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.