యాప్నగరం

‘నా భర్తను ఎన్‌కౌంటర్ చేసిన చోటే నన్నూ చంపేయండి’.. చెన్నకేశవులు భార్య

వారం రోజుల క్రితం తన భర్తను ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లారని, ఇన్నిరోజులు కనీసం ఆయన్ని కలిసేందుకు కూడా అనుమతించలేదని చెబుతోంది.

Samayam Telugu 6 Dec 2019, 1:23 pm
శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణంగా చంపేసిన ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ పోలీసులపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కామంతో రెచ్చిపోయి అమాయకురాలి ప్రాణం తీసిన మృగాళ్లకు పోలీసులు సరైన శిక్ష విధించారంటూ అన్నివర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
Samayam Telugu encounter


Also Read: యాధృచ్ఛికం... ‘దిశ’ దశదిన కర్మ రోజే నిందితుల ఎన్‌కౌంటర్

మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌పై మృతుల కుటుంబసభ్యులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డలను పోలీసులు అన్యాయంగా చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన భర్తను పోలీసులు అన్యాయంగా చంపేశారని నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఒక్క అమ్మాయి కోసం నలుగురిని పొట్టన పెట్టుకోవడం సరికాదని అంటోంది. ఆపద సమయంలో ‘దిశ’ చెల్లెలికి ఫోన్ చేసే బదులు పోలీసులకు ఫోన్ చేస్తే ఈ ఘోరం జరిగేది కాదని పేర్కొంది.

Also Read: ఆత్మరక్షణ కోసమే వారిని ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చింది: పోలీసులు

ప్రస్తుతం గర్భవతిగా ఉన్న చెన్నకేశవులు భార్య ఎన్‌కౌంటర్ విషయం తెలియగానే విషాదంలో మునిగిపోయింది. తన భర్త నేరం చేసినట్లు నిర్ధారించి తీర్పు ఇవ్వకముందే పోలీసులు ఇలా చేయడం తప్పని ఆమె అంటోంది. వారం రోజుల క్రితం తన భర్తను ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లారని, ఇన్నిరోజులు కనీసం ఆయన్ని కలిసేందుకు కూడా అనుమతించలేదని చెబుతోంది. మీ ఆయన ఇంటికి వచ్చేస్తాడులే, ఇప్పుడు కలిసేందుకు ఎందుకు తొందర అంటూ కొందరు నన్ను వారించారని, కానీ ఇప్పుడు ఆయన ప్రాణమే తీశారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు ఇంత అన్యాయం చేసిన పోలీసులు తన భర్తను చంపిన చోటికే తననూ తీసుకెళ్లి చంపేయాలని కోరుతోంది. తన భర్త లేని లోకంలో తాను బతకలేనని ఆమె అంటోంది.

Also Read: అదే స్పాట్.. దిశను సజీవదహనం చేసిన దగ్గరే నలుగురి ఎన్‌కౌంటర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.