Madhurai: పంజాబ్ యూనివర్సిటీలో అమ్మాయిల వీడియోలు లీకైన ఘటన మరువకముందే.. అలాంటిదే తమిళనాడులో చోటుచేసుకుంది. మధురైలో బీఈడీ చదువుకుంటూ హాస్టల్లో ఉండే అమ్మాయి.. తన ప్రియుడి కోసం దారుణానికి పాల్పడింది. రామనాథపురం కముదికి చెందిన డాక్టర్ ఆషిక్.. బీఈడీ చదువుకుంటున్న జనని లవర్స్. జనని ఓ మధురైలో ఓ హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. అయితే జనని తన హాస్టల్ మేట్స్ దుస్తులు మార్చుకుంటున్నప్పుడు, స్నానాలు చేస్తున్నప్పుడు ఫోటోలు, వీడియోలు తీసి.. రహస్యంగా ఆషిక్కి పంపించేది. మొదట్లో తన వీడియోలు, పంపించేది.. కానీ ఆషిక్ ఒత్తిడి కారణంగా హాస్టల్లో ఇతర అమ్మాయిలవి పంపించడం మొదలుపెట్టింది. అయితే జననీ ప్రవర్తనపై హాస్టల్లో ఇతర అమ్మాయిలకు అనుమానం వచ్చి.. ఆమె ఫోన్ చెక్ చేయగా.. వారి ఫోటోలు కనిపించాయి. దాంతో మొత్తం విషయం తెలిసింది. దాంతో హాస్టల్లో ఉన్న అమ్మాయిలు ఆమె గురించి వార్డెన్‌కు చెప్పారు. అలాగే మధురై అన్నానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దాంతో ఈ ఘటనపై పోలీసులు విచారణ చేయగా.. జననీ తన వీడియోలే కాకుండా.. హాస్టల్లో ఇతర అమ్మాయిల వీడియోలన పంపించినట్టు తేలింది. "జనని మార్చి నుంచి హాస్టల్లో ఉంటోంది. ఆమె నగ్న ఫోటోలతో పాటు ఇతర అమ్మాయిల ఫోటోలు, వీడియోలను తీసి తన స్నేహితుడు ఆషిక్‌కు పంపింది" అని పోలీసుల తెలిపారు. ఆషిక్ నడుపుతున్న క్లీనిక్‌లో జనని పని చేయడంతో ఇద్దరికి పరిచయం అయిందని, అప్పటి నుంచి వాళ్లు రిలేషన్షిప్లో ఉన్నారని పోలీసులు చెప్పారు.
ఈ మేరకు పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని డేటా రికవరీ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఆషిక్ ఈ వీడియోలను వేరే వారికి పంపించాడనే దానిపై స్పష్టత లేదని పోలీసులు తెలిపారు.
Read Also:అందమైన ఫోటోలతో గాలం.. పెళ్లి చేస్తామంటూ రూ.1.6 కోట్లు స్వాహా .. ఓ జంట నిర్వాకం