యాప్నగరం

ముసలావిడకు తోడుగా ఉంచితే.. ఇంటికే కన్నం వేశాడు..!

అనారోగ్యంతో ఉన్న వృద్ధురాలికి తోడుగా వరుసకు మనువడయ్యే యువకుడిని ఉంచితే అతడు ఏకంగా ఆ ఇంటికే కన్నం వేశాడు. భారీగా బంగారు నగలు చోరీ చేసి పరారయ్యాడు. హైదరాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Samayam Telugu 20 Dec 2019, 2:05 pm
అనారోగ్యంతో ఉన్న వృద్ధురాలికి తోడుగా ఉంటాడని వరుసకు మనువడయ్యే యువకుడిని ఉంచితే ఆ ఇంటికే కన్నం వేశాడు. భారీగా బంగారు నగలు చోరీ చేసి పరారయ్యాడు. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి డివిజన్‌ డీసీసీ రక్షితా మూర్తి, ఏసీపీ నర్సింహారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జయేంద్రనగర్‌కు చెందిన ఈగలపాటి ప్రవీణ్‌ కుమార్‌ అలియాస్‌ పండు (30) తండ్రితో కలిసి రైస్‌మిల్‌ నిర్వహిస్తున్నాడు. అయితే ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
Samayam Telugu pandu


Also Read: బంధువులమంటూ ఇంటికొచ్చి.. మెడలో చైన్ లాక్కుని పరార్..!

హైదరాబాద్‌లోని మౌలాలి ఎస్పీ నగర్‌కు చెందిన బీఎస్‌ఎన్‌ఎల్‌ విశ్రాంత ఉద్యోగి దొరైస్వామి పిన్ని సరస్వతికి ఆరోగ్యం బాగోలేదు. దీంతో బంధువైన ప్రవీణ్‌కుమార్‌ను తీసుకొచ్చి కేర్‌టేకర్‌గా ఏర్పాటు చేశాడు. దొరైస్వామి కుమారుడి వివాహం జనవరి 7వ తేదీన ఉండటంతో పెళ్లి పత్రికలు పంచే సమయంలో ఆయన భార్య విజయలక్ష్మి తన బంగారు నగలను సరస్వతి వద్ద ఉంచింది.

Also Read: కోళ్ల దొంగలు.. కోసుకుతినేశారు! ఓ రైతు వేదన..!

అయితే చెడు వ్యవనాలకు బానిసైన ప్రవీణ్‌కుమార్‌ వృద్ధురాలి ఇంట్లో బంగారం ఉండడాన్ని గమనించాడు. సుమారు 14 తులాల బంగారు నగలు కాజేసి ఊరికి వెళ్లిపోయి ఏమి తెలియనట్లు పని చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే విజయలక్ష్మి ఈ నెల 16న సరస్వతి వద్దకు వెళ్లి నగలు తీసుకోవాలని బీరువాలో చూస్తే నగలు కనిపించలేదు. వెంటనే ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు గురువారం ఎస్పీ నగర్‌లో ప్రవీణ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితుడి వద్ద ఉన్న 10.7 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఆభరాణాల గురించి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీసీ, ఏసీపీలు తెలిపారు.

Also Read: ఉల్లి దొంగల భరతం పట్టిన పోలీసులు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.