యాప్నగరం

ఆ హంతకుడిని పట్టిస్తే రూ.70లక్షలు నజరానా.. అమెరికా బంపరాఫర్

మేరీల్యాండ్ పోలీసులు భద్రేశ్ కోసం ఎంత గాలించినా అతడి ఆచూకీ తెలియలేదు. దీంతో ఈ కేసునుఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ)కి బదిలీ చేశారు. ఎఫ్‌బీఐ భారత్ సాయంతో అతడి కోసం గాలించినా కనిపెట్టలేకపోయింది.

Samayam Telugu 20 Oct 2019, 12:51 pm
Samayam Telugu pjimage (6)

భార్య హత్యకేసులో నిందితుడిగా ఉండి తప్పించుకుని తిరుగుతున్న భారత్‌కు చెందిన ఓ వ్యక్తి కోసం అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ తీవ్రంగా గాలిస్తోంది. సుమారు నాలుగేళ్లుగా అమెరికా, ఇండియాలో అతడి కోసం ఎంత గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో చివరకు ఎఫ్‌బీఐ భారీ పారితోషికం ప్రకటించింది. ఆ హంతకుడి ఆచూకీ చెప్పినవారికి ఏకంగా రూ.70లక్షలు ఇస్తామని ప్రకటించింది.

Also Read: అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను రూ.5లక్షలకు అమ్మేసిన మహిళ

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన భద్రేశ్‌కుమార్, భార్య పాలక్‌(21) అమెరికాలోని హనోవర్‌ మేరీల్యాండ్‌లోని డంకిన్‌ డోనట్‌ స్టోర్‌లో పనిచేసేవారు. 2015 ఏప్రిల్ 12వ తేదీన వీరిద్దరు రాత్రివేళ స్టోర్‌లో విధులు నిర్వహించారు. ఆ మరుసటి రోజు ఉదయం పాలక్ రక్తపు మడుగులో విగతజీవిగా కనపడకగా.. భద్రేశ్ అదృశ్యమయ్యాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ పుటేజీ చూసి షాకయ్యారు. హత్య జరిగిన రోజు రాత్రి భద్రేశ్ భార్యతో కలిసి స్టోర్ రూమ్‌లోకి వెళ్లి కొద్దిసేపటి తర్వాత కంగారుగా ఒక్కడే బయటకు రావడం స్పష్టంగా రికార్డైంది.

Also Read: హైదరాబాద్‌లో వ్యభిచారం గుట్టురట్టు.. విటుడు సహా ముగ్గురి అరెస్ట్

స్టోర్‌ నుంచి కాలినడకన ఇంటికి వెళ్లి కొన్ని వస్తువులను తీసుకుని సమీప విమానాశ్రయానికి వెళ్లి రారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న మేరీల్యాండ్ పోలీసులు భద్రేశ్ కోసం ఎంత గాలించినా అతడి ఆచూకీ తెలియలేదు. దీంతో ఈ కేసునుఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ)కి బదిలీ చేశారు. ఎఫ్‌బీఐ భారత్ సాయంతో అతడి కోసం గాలించినా కనిపెట్టలేకపోయింది. దీంతో ఆ హంతకుడిని పట్టించిన వారికి రూ.70 లక్షలు ఇస్తామని తాజాగా ప్రకటించింది. తమ కళ్లు కప్పి తిరుగుతున్న అతి ముఖ్యమైన పది మంది నిందితుల్లో భద్రేశ్‌కుమార్‌ ఒకరని ఎఫ్‌బీఐ ప్రకటించిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Also Read: కొడుకు ఫ్రెండ్స్‌కి డ్రగ్స్ ఇచ్చి సెక్స్ బానిసలుగా మార్చుకున్న మహిళ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.