యాప్నగరం

ఉమ్మివేసిన కవర్లు ఇళ్లలోకి విసిరి అరాచకం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే.!

ఇళ్లలోకి ఉమ్మివేసిన కవర్లు వచ్చి పడడంతో తీవ్ర కలకలం రేగింది. నలుగురు మహిళలు ఆ కవర్లు విసిరినట్లుగా గుర్తించిన పోలీసులు.. వారిని విచారించడంతో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 15 Apr 2020, 5:25 pm
కరోనా మహమ్మారి దెబ్బకి ప్రజలు బెంబేలెత్తిపోతుంటే కొందరు మాత్రం ఇదే అదనుగా అరాచకాలకు దిగుతున్నారు. ప్రజలను మరింత భయపెట్టి శాడిజానికి పాల్పడుతున్నారు. జనాలపై ఉమ్మి వేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అలాంటి దారుణ ఘటన ఒకటి రాజస్థాన్‌లో వెలుగుచూసింది. ఉమ్మివేసిన కవర్లను కొందరు మహిళలు ఇళ్లలోకి విసిరిన ఘటన భయభ్రాంతులకు గురిచేసింది.
Samayam Telugu coronavirus


కోట పట్టణంలోని వల్లభ్వాడి ప్రాంతంలో కొందరు మహిళలు ఉమ్మి వేసిన కవర్లను ఇళ్లలోకి విసిరేయడం కలకలం రేపింది. కరోనా మహమ్మారి విజృంజభణతో భయాందోళన చెందుతున్న ప్రజలను ఊహించని ఘటన షాక్‌కు గురిచేసింది. ఐదుగురు మహిళలు ఉమ్మి వేసిన కవర్లను ఇళ్లలోకి విసరడం చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వారు అలా ఎందుకు విసురుతున్నారో అర్థంకాక భయపడిపోయారు.

Also Read: నిద్రపోతున్న భర్తపై సలసల కాగుతున్న నూనె పోసి.. భార్య పైశాచికం

మహిళలు ఉమ్మి వేసిన కవర్లను ఇళ్లలోకి విసిరిన విషయం పోలీసులకు తెలియడంతో రంగంలోకి దిగారు. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో పోలీసులు తక్షణ చర్యలు చేపట్టారు. అనుచిత చర్యలకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఆ ఏరియాలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి వారిని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు.

సీసీటీవీ ఫుటేజీల ద్వారా మహిళల కదలికలను క్షుణ్ణంగా గమనించిన పోలీసులు.. వారిని పట్టణంలోని కున్హారి ఏరియాలోని బాపు కచ్చి బస్తీకి చెందిన మహిళలు మాలా బవారి, దులారి బవారి, ఆశ బవారి, చందా బవారి సహా మరొకరిని గుర్తించారు. విచారణలో మహిళలు చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్‌కు గురయ్యారు. తాము భిక్షం అడిగి బతుకుతుంటామని.. భిక్షం వేయలేదన్న అక్కసుతోనే ఉమ్మివేసిన కవర్లను ఇళ్లలోకి విసిరినట్లు చెప్పడంతో కంగుతిన్నారు. వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు.

Read Also: భార్య ఫోన్‌కి మిస్డ్‌ కాల్.. అనుమానంతో భర్త ఘాతుకం.. గుంటూరులో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.