యాప్నగరం

లండన్ వచ్చి గుట్టుగా పెళ్లి... చిక్కుల్లో పడిన విశాఖ యువకుడు

లండన్ నుంచి వచ్చిన యువకుడిని స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు ఆదేశించారు. అయితే ఆదేశాలను పట్టించుకోకుండా అతడు గన్నవరం వెళ్లి యువతిని పెళ్లి చేసుకున్నాడు.

Samayam Telugu 27 Mar 2020, 7:51 am
విదేశాల నుంచి వచ్చిన వారు కచ్చితంగా క్వారంటైన్ పాటించి తీరాలని ప్రభుత్వాలు, అధికారులు ఇచ్చిన ఆదేశాలను అతిక్రమించిన యువకుడిపై కేసు నమోదైంది. కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న లండన్ నుంచి విశాఖ వచ్చిన ఆ యువకుడు బంధుమిత్రుల సమక్షంలో గుట్టుగా పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అంటు రోగాల నివారణ చట్టంతో పాటు మరో నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Samayam Telugu home-quarantine-1584463060642


Also Read: హోమ్ క్వారంటైన్‌లో ఉండమన్నందుకు దారుణం.. సొంతూరి వ్యక్తినే కొట్టి చంపేసి..

విశాఖ నగరానికి చెందిన ఓ యువకుడు లండన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. అతడికి కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకికి చెందిన యువతితో గతంలోనూ వివాహం నిశ్చయమైంది. ఈ నెల 22వ వివాహం చేసేందుకు ముహూర్తాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆ యువకుడు ఈనెల 14న లండన్‌ నుంచి విశాఖకు చేరుకున్నారు. కరోనా లేదంటూ వైద్య సిబ్బంది ఇచ్చిన ధ్రువపత్రాన్ని చూపించాక ఇంట్లోనే స్వీయ నిర్బంధం పాటించాలని సూచిస్తూ అధికారులు అతడిని పంపించారు. అప్పటినుంచి వైద్యాధికారులు అతడిని పర్యవేక్షిస్తున్నారు.

Also Read: కరోనా ఎఫెక్ట్.. లోడు లారీ నుంచి బీర్ కేసులు లూటీ.. ఎక్కడంటే.?

అయితే హోమ్ క్వారంటైన్‌లోనే ఉంటే పెళ్లి వాయిదా పడుతుందన్న ఆందోళనతో ఆ యువకుడు అధికారులకు సమాచారం ఇవ్వకుండా కుటుంబసభ్యులతో కలిసి గుట్టుగా గన్నవరం చేరుకున్నాడు. ఓ కళ్యాణ మండపంలో 22వ తేదీన ఆ యువతిని పెళ్లాడాడు. విశాఖలో ఆ యువకుడి ఆచూకీ తెలియకపోవడంతో కంగారు పడిన అధికారులు అతడి కోసం ఆరా తీయగా గన్నవరం వెళ్లి పెళ్లి చేసుకున్నాడని తేలింది. దీంతో వారు కృష్ణా జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. గన్నవరం పోలీసులు ఆ యువకుడిని విచారించి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.