యాప్నగరం

భార్యతో గొడవపడి ఇంటి యజమాని హత్య.. ఒక్క గుద్దుతో కుప్పకూలిపోయాడు

భార్యతో గొడవపడుతున్న సమయంలో ఇంటి ఓనర్ టీవీ సౌండ్ పెంచాడన్న ఆక్రోశంతో బాలనర్సయ్య అతడి తలపై కొట్టాడు. దీంతో యజమాని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

Samayam Telugu 21 Feb 2020, 10:42 am
దంపతుల మధ్య వివాదం ఇంటి యజమాని హత్యకు దారి తీసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. భార్యతో గొడవపడుతున్న కిరాయి దారుడు ఇంటి యజమాని టీవీ సౌండ్ పెద్దగా పెట్టుకుని చూస్తున్నాడన్న కోపంతో అతడిని చంపేశాడు. ఆర్మూర్‌‌లో బుధవారం రాత్రి జరిగిన ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి.
Samayam Telugu crime


Also Read: నిజామాబాద్ జిల్లాలో విషాదం.. కిరోసిన్ తాగి 11 నెలల చిన్నారి మృతి

గోల్‌బంగ్లా ప్రాంతంలో గిర్మాజీ రాజేందర్‌ (40) అనే వ్యక్తికి సొంత ఇల్లు ఉంది. ఓ పోర్షన్ ఖాళీ ఉండటంతో బాలనర్సయ్య అనే వ్యక్తి అద్దెకి ఇచ్చాడు. బుధవారం రాత్రి బాలనర్సయ్య భార్యతో గొడవపడుతున్న సమయంలో రాజేందర్ భార్య, కొడుకుతో కలిసి టీవీ సౌండ్ పెద్దగా పెట్టుకుని చూస్తున్నాడు. దీంతో మరింత కోపోద్రిక్తుడైన బాలనర్సయ్య రాజేందర్‌తో గొడవకు దిగాడు. ఆయన తలపై చేత్తో కొట్టడంతో రాజేంద్రర్ ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.

Also Read: సంసారంలో ఆస్తి చిచ్చు... నిద్రపోతున్న భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆర్మూర్ సీఐ రాఘవేందర్‌, ఎస్సై యాదగిరిగౌడ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు బాలనర్సయ్యపై కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీ కావడంతో అతడి కోసం గాలిస్తున్నారు.

Also Read: ప్రేమకు అడ్డొస్తున్నాడని ప్రియురాలి అన్న దారుణహత్య.. 15నెలల తర్వాత దొరికాడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.