యాప్నగరం

ఐపీఎల్ మ్యాచ్ చూస్తోన్న భార్యభర్తల హత్య... యూపీలో దారుణం

యూపీలోని దారుణ హత్యలు జరిగాయి. ఇంట్లో రాత్రి ఐపీఎల్ మ్యాచ్ వీక్షిస్తున్న భార్యభర్తలను హత్య చేశారు. పొద్దుటికి వారు రక్తపు మడుగులో కనిపించారు. దాంతో అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఘటనా స్థలంలో ఎర్రటి నీళ్లతో నిండి స్టీల్ సాసర్ ఉందని, దాంట్లో హంతకుడు చేతులను, ఆయుధాలను కడుగుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని పోలీసులు వెల్లడించారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 19 May 2022, 6:15 pm

ప్రధానాంశాలు:

  • కాన్పూర్‌లో ని ఇంట్లో జంట హత్య
  • ఘటనా స్థలంలో ఎర్రటి నీళ్లతో నిండిన స్టీల్ సాసర్‌
  • దర్యాప్తు చేస్తోన్న పోలీసులు అధికారులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతికాత్మక చిత్రం
ఉత్తరప్రదేశ్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కాన్పూర్‌లో రామ్‌బాగ్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ జంటను చంపేశారు. ఇంట్లో ఐపీఎల్ మ్యాచ్‌ చూస్తున్న సమయంలో భార్య భర్తలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళన సృష్టిస్తుంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బుధవారం రాత్రి శివం తివారీ (27) అతని భార్య రూబీ (25) టీవీలో ఐపీఎల్ మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు. రాత్రి 11.30 సమయంలో శివం తండ్రి దీప్ తివారీ నిద్రించడానికి డాబాపైకి వెళ్లారు. డాబాపై పడుకున్న ఆయన గురువారం ఉదయం 6:30 గంటలకు కిందకు వచ్చి ఇంట్లోకి వెళ్లగా రక్తపు మడుగులో ఉన్న కొడుకు, కోడలు కనిపించారు. దాంతో కేకలు పెడుతూ బయటకొచ్చాడు.

దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ సింగ్ మీనా, జాయింట్ సీపీ ఆనంద్ ప్రకాష్ తివారీ, డీసీపీ వెస్ట్ బీబీజీటీఎస్ మూర్తి, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. ఘటనపై వివరాలు సేకరించేందుకు మూడు బృందాలను రంగంలోకి దించారు.

ఈ సందర్భంగా ఇద్దరిని చాలా దారుణంగా హత్య చేశారని పోలీస్ కమిషనర్ విజయ్ సింగ్ మీనా తెలిపారు. శివం డెడ్‌బాడీ పక్కనే రూబీ మృతదేహం పడి ఉందని, ఇద్దరి తలలు ఎదురుగా ఉన్నాయని చెప్పారు. ఈ కేసును త్వరలోనే చేధిస్తామని తెలిపారు. అలాగే ఇంట్లో ఎర్రటి నీళ్లతో నిండిన స్టీల్ సాసర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హంతకుడు రక్తపు మరకలతో ఉన్న చేతులను లేదా ఆయుధాలను అందులో కడుకున్నట్టు అనుమానిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.