పిల్లనిచ్చిన అత్తపైనే అత్యాచారం చేశాడో కామాంధుడు. మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అల్లుడి బారి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు ప్రయత్నించినా వీలు కాకపోవడంతో అతడి అన్యాయానికి బలైపోయింది. ఈ ఘటన హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పరిధిలో బుధవారం జరిగింది.
అనంతరం బాధితురాలిని ఇంటి వద్ద దించేసి ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నీ కూతురిని వదిలేస్తానని బెదిరించాడు. అయితే అల్లుడు ఈ విషయాన్ని అలుసుగా తీసుకుని తనపై అఘాయిత్యాన్ని కొనసాగిస్తూనే ఉంటాడని భావించిన అత్త వెంటనే చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.