యాప్నగరం

హైదరాబాద్‌లో దారుణం... మద్యం దొరక్క మతిస్థిమితం కోల్పోయి...

నాలుగు రోజులుగా ఎక్కడా చుక్క మందు కూడా దొరకలేదు. దీంతో మద్యం కోసం అల్లాడిపోయాడు. మందు దొరక్కా అతడికి పిచ్చెక్కిపోయింది. దీంతో ఉదయం లేవగానే... పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తూ... బయటకు వెళ్లిపోయాడు.

Samayam Telugu 28 Mar 2020, 12:08 pm
దేశం మొత్తం ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తోంది. నిత్యవసర షాపులు, మెడికల్ మినహాయించి అన్నిరకాల దుకాణాలు బంద్ చేశారు. ఎక్కడికక్కడ లాక్ డౌన్ ప్రకటించారు. మద్యం షాపులు సైతం మూతపడ్డాయి. దీంతో మద్యం దొరక్క మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చుక్క లేనిది నిద్రపట్టడం లేదని సోషల్ మీడియాలో పలువురు పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే భాగ్యనగరానికి చెందిన ఓ వ్యక్తి మద్యం దొరక్క మతిస్థిమితం కోల్పోయాడు. భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బంజారహిల్స్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.
Samayam Telugu suicide


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 2లోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్న మధు అనే 55 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నారు.సినీ పరిశ్రమలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మధుకు రోజూ మద్యం సేవించే అలవాటు ఎంది. అయితే లాక్ డౌన్ కారణంగా గత నాలుగురోజులుగా ఎక్కడా మద్యం దొరకలేదు. దీంతో మందు తాగేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఎక్కడా మద్యం దొరక్కపోవడంతో మతి స్థిమితం కోల్పోయాడు. శుక్రవారం ఉదయం ఇంట్లోంచి బయటకు వెళ్లి బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 10లోని జడ్జిస్‌ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. అక్కడ నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యులు దగ్గర లో ఉన్న హాస్పిటల్ కి తరలించారు.హస్పిటల్ లో చికిత్స పొందుతూ మధు చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి కొడుకు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు కేరళలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉండటంతో మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. దీంతో.. మద్యానికి బానిసైన.. కేరళకు చెందిన 38 ఏళ్ల వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మద్యం దొరక్కపోవడంతో మనస్తాపానికి గురై చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళలోని తువ్వనూర్‌‌లో శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. చనిపోయిన వ్యక్తిని కులంగర వీట్టిల్ సనోజ్‌గా పోలీసులు గుర్తించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.