యాప్నగరం

భార్యను బెదిరించేందుకు తన ఇంట్లోనే దొంగతనం చేయించిన రౌడీషీటర్

నాదర్‌గుల్ నుంచి పాతబస్తీకి మకాం మార్చేందుకు భార్య ఒప్పుకోవడం లేదన్న కోపంతో తన ఇంట్లోనే దొంగతనం చేయించాడు మోజెస్. పోలీసుల విచారణలో బండారం బయటపడటంతో ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు.

Samayam Telugu 8 Jan 2020, 10:20 am
మకాం మార్చేందుకు భార్య ఒప్పుకోవడం లేదన్న కక్షతో తన సొంటింట్లోనే దొంగతనం చేయించాడో ప్రబుద్ధుడు. చివరికి నాటకం బయటపడటంతో ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు. బాలాపూర్‌ మండలం నాదర్‌గుల్‌లోని పంతుల్‌బాయి కాలనీలో నివాసం ఉండే రాణి తన ఇంట్లో బంగారం చోరీ అయినట్లు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాదర్‌గుల్‌ ఎంవీఎస్‌ఆర్‌ కళాశాల కాలేజీ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో మోజెస్‌ అనే వ్యక్తి స్కూటీలో కత్తి, తదితర మారణాయుధాలతో పట్టుబడ్డాడు. అతడు ఫిర్యాదుదారు రాణి భర్తగా పోలీసులు గుర్తించారు.
Samayam Telugu hyde


Also Read: కొబ్బరిమట్టలతో కొట్టి, మద్యం తాగించి వివాహితపై గ్యాంగ్ రేప్.. ఏలూరులో రౌడీషీటర్ల అకృత్యం

మోజెస్ వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తానే చోరీ చేయించినట్లు అంగీకరించాడు. తనకు నాదర్‌గుల్‌లో ఉండటం తనకు ఇష్టంలేదని, పాత బస్తీలోని మరో ఇంటికి మారదామని ఎన్నోసార్లు భార్యకు చెబుతున్నా వినడం లేదని చెప్పాడు. ఇంట్లో దొంగతనం జరిగితే భయపడి, మకాం మార్చడానికి అంగీకరిస్తుందని భావించానని, అందుకే తన డ్రైవర్‌ బోడ నవీన్‌తో తన ఇంట్లోనే దొంగతనం చేయించానని, ఇందుకోసం రూ.లక్ష ఒప్పందం చేసుకున్నానని చెప్పడంతో పోలీసులు షాకయ్యారు.

Also Read: హోటల్‌ రూమ్‌లో ఎస్‌బీఐ ఉద్యోగిని ఆత్మహత్య.. కర్నూలులో కలకలం

దీంతో పోలీసులు నాదర్‌గుల్‌లోనే నివాసం ఉండే నవీన్‌ ఇంట్లో సోదా చేయడంతో రాణి ఇంట్లో చోరీ అయిన రూ.2.88 లక్షల విలువ గల పది తులాల బంగారం కనిపించింది. నవీన్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మోజెస్‌ పాతబస్తీకి చెందిన రౌడీషీటర్‌ అని, సంతోష్‌నగర్‌ తదితర పోలీస్‌స్టేషన్‌లలో అతడిపై 14 కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు చెప్పారు. దొంగతనంతో పాటు మారణాయుధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై నిందితులిద్దరిపైనా కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపరిచామని పోలీసులు తెలిపారు.

Also Read: నెల్లూరులో 9 ఏళ్ల బాలికపై రేప్.. శిక్ష ఖరారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.