యాప్నగరం

అందుకే నేను పెళ్లి చేసుకోనన్నా.! సాఫ్ట్‌వేర్ శ్వేత కేసులో షాకింగ్ ట్విస్ట్

బీబీనగర్ వద్ద రైలుపట్టాలపై సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్వేత మృతదేహం లభ్యమైంది. ఆమెది ఆత్మహత్య కాదని.. చంపేసి పట్టాలపై పడేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Samayam Telugu 22 Oct 2020, 4:48 pm
సాఫ్ట్‌వేర్ శ్వేత ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. శ్వేత తనతో కలసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినట్లు ప్రియుడు అజయ్ ఒప్పుకున్నాడు. అయితే పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడం.. అందుకు సంబంధించిన విషయాలపై కూడా విచారణలో కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. తనపై పోలీస్ కేసు పెట్టారన్న కోపంతోనే ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించినట్లు నిందితుడు చెప్పినట్లు తెలుస్తోంది.
Samayam Telugu శ్వేత(ఫైల్ ఫొటోలు)
techie suicide


శ్వేత ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పాస్‌వర్డ్‌లు తీసుకున్న అజయ్.. ప్రియురాలితో కలసి ఉన్న ఫొటోలను అప్‌లోడ్ చేశాడు. ఆ విషయం బయటికి పొక్కడంతో శ్వేత కుటుంబ సభ్యులు తనపై పోలీస్ కేసు పెట్టారని.. తనపై కేసు పెట్టారన్న కోపంతోనే పెళ్లి చేసుకునేందుకు నిరాకరించినట్లు అజయ్ చెప్పాడు. అయితే శ్వేత ఆత్మహత్యపై ఆమె తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెది ఆత్మహత్య కాదని.. అజయ్ హత్య చేసి సూసైడ్‌గా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Also Read: పుట్టింటి వాళ్లు బంగారం పెడితేనే సీమంతం.! హైదరాబాద్‌లో గర్భిణి ఆత్మహత్య

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ శ్వేత గత నెల 18 న ఇంటి నుంచి వెళ్లిపోయింది. మరుసటి రోజు నగర శివారు బీబీనగర్ సమీపంలోని ఎన్‌ఎఫ్‌సీ రైలు పట్టాలపై శ్వేత మృతదేహాన్ని గుర్తించారు. ప్రియుడు మోసం చేయడాన్ని భరించలేక శ్వేత ఆత్మహత్య చేసుకుందని ఆరోపణలు వచ్చాయి. ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు ప్రియుడు అజయ్‌ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పోలీసు విచారణ ఇంకా కొనసాగుతోంది.

Read Also: భర్త ఇంట్లో లేడని అర్ధరాత్రి తలుపుకొట్టి.. తూర్పు గోదావరిలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.