యాప్నగరం

పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. వివాహితతో కోరిక తీర్చుకుని

భర్త పెట్టే వేధింపులు భరించలేక పుట్టింటికి వచ్చేసిన మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో కోరికలు తీర్చుకున్న తర్వాత తప్పించుకుని తిరుగుతున్న యువకుడు. బాధితురాలి ఫిర్యాదుతో అరెస్ట్ చేసిన పోలీసులు.

Samayam Telugu 9 Jan 2020, 1:05 pm
భర్తకు దూరంగా ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్న వివాహితను నమ్మించి మోసం చేసిన యువకుడిని హైదరాబాద్ మల్కాజ్‌గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. నాచారం ప్రాంతానికి చెందిన ఓ మహిళకు కొన్నేళ్ల కిత్రం వివాహమైంది. ఐదేళ్ల బాబు, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. నాలుగు నెలలుగా తరుచూ అనుమానిస్తూ శారీరకంగా, మానసికంగా హింసించడంతో భరించలేక పిల్లలతో మూడు నెలల క్రితం పుట్టింటికి వచ్చేసింది.
Samayam Telugu sex


Also Read: తల్లిదండ్రుల చెంతకు చేరిన బాలుడు.. పోలీసులకు థ్యాంక్స్ చెప్పిన పేరెంట్స్

ఉత్తరప్రదేశ్‌ బరేలీ ప్రాంతానికి చెందిన ఆఫన్‌(19) వంట పనులు చేసుకుంటూ జవహర్‌నగర్‌లో నివసిస్తున్నాడు. ఇద్దరూ ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యారు. ఇటీవల ఆమె జవహర్‌నగర్‌లోని ఓ ఇంట్లో పనికి కుదిరింది. దీంతో ఆఫన్ తరుచూ ఆ ఇంటికి వచ్చిన ఆమెను కలుస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఇంటి యజమాని, స్థానికులు నిలదీయగా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.

Also Read: మూగజీవాలనూ వదలని కామాంధులు.. ఆవును రేప్ చేసి కిరాతకంగా చంపేశారు

అయితే ఆ రోజు నుంచి ఆఫన్ ఆమెను కలవడం మానేశాడు. ఫోన్ చేస్తే ఎత్తకపోవడం, తప్పించుకుని తిరుగుతుండటంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మల్కాజ్‌గిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని బుధవారం నిందితుడిని అరెస్ట్ చేశారు.

Also Read: నిద్రమాత్రలు మింగిన ముగ్గురు డిగ్రీ విద్యార్థినులు... ఆ వేధింపులే కారణమంటూ వాంగ్మూలం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.