యాప్నగరం

బంధువు ప్రేమ వేధింపులు.. నిప్పటించుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్ చదువుతున్న యువతిని బంధువుల కుర్రాడే తీవ్రంగా వేధిస్తున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పగా వారు మాట్లాడతామన్నారు. మనస్తాపానికి గురైన యువతి శుక్రవారం నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.

Samayam Telugu 21 Mar 2020, 7:51 am
ప్రేమ పేరుతో సమీప బంధువే తీవ్రంగా వేధించడంతో తట్టుకోలేకపోయిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన యువతి(17) నర్సాపూర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఇటీవలే పరీక్షలు రాసి ఇంటి వద్దే ఉంటోంది. సమీప బంధువైన ఓ యువకుడు(20) ప్రేమించాలంటూ ఆమెను తీవ్రంగా వేధిస్తున్నాడు. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి దూరి బెదిరింపులకు గురిచేస్తున్నాడు. తనను ప్రేమించకపోతే చంపేస్తానని హెచ్చరించేవాడు.
Samayam Telugu fire dead


Also Read: గ్రామ వాలంటీర్ల మధ్య ప్రేమ చిచ్చు.. వేధింపులతో మహిళా వాలంటీర్ ఆత్మహత్య

గురువారం రాత్రి కూడా ఆ యువకుడి మరోసారి తీవ్రంగా వేధించడంతో తట్టుకోలేకపోయిన యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. అయితే బంధువుల కుర్రాడు కావడంతో జాగ్రత్తగా సమస్యను పరిష్కరించాలని, శుక్రవారం మాట్లాడతామని వారు చెప్పారు. ఉదయం తండ్రి గొర్రెల మేపడానికి వెళ్లగా, తల్లి ఇంటి పనుల నిమిత్తం వెనుక వైపునకు వెళ్లింది. అయితే తన విషయంలో తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదని మనస్తాపానికి గురైన యువతి శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.

Also Read: యూట్యూబ్ వీడియో చూస్తూ యువతికి ప్రసవం... కటకటాల్లోకి ప్రియుడు

ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన తల్లి లోపలికి వెళ్లి చూసేసరికే కుమార్తె కాలిపోతోంది. ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి మంటలు ఆర్పివేశారు. అప్పటికే యువతి ప్రాణాలు కోల్పోయింది. ప్రేమ వేధింపులే తమ కూతురి ప్రాణం తీశాయని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: కట్నపిశాచిగా మారిన కానిస్టేబుల్... వేధింపులతో దారుణానికి ఒడిగట్టిన భార్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.