యాప్నగరం

గిన్నె కోసం తన్నుకున్న తోడికోడళ్లు.. బావ అడ్డొచ్చాడని మరదలి ఘాతుకం

దహీ భల్లా ఇచ్చేందుకు అయిష్టంగా వెళ్లిన తమ్ముడి భార్య గిన్నె విసిరికొట్టింది. అది తోటికోడలికి కోపం తెప్పించింది. ఇద్దరి మధ్య ఘర్షన చెలరేగి తన్నుకోవడం మొదలుపెట్టారు.

Samayam Telugu 13 May 2021, 6:14 pm

ప్రధానాంశాలు:

  • తోటికోడలితో గొడవపడి కొట్లాట
  • అడ్డువచ్చిన బావ
  • కత్తితో పొడిచేసిన మరదలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
arrest
గిన్నె కోసం మొదలైన గొడవ దారుణ హత్యకు దారితీసింది. తన్నుకుంటున్న తోడికోడళ్లను విడదీసేందుకు వెళ్లిన బావని మరదలు పొడిచి చంపేసింది. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నగరంలోని పండా మండీ ఏరియాలో ఫరియా, షారుక్ దంపతులు నివాసముంటున్నారు. అదే భవనంలో షారుక్ ముగ్గురు అన్నదమ్ములు కూడా ఉంటున్నారు. షారుక్ భార్య ఫరియాకి తోటికోడలితో పడేది కాదు.
షారుక్ అన్న మొహసీన్, అతని భార్యతో ఫరియాకి తరచూ గొడవలు జరిగేవి. తోటికోడళ్లు తీవ్రంగా దుర్భాషలాడుకునేవారు. మూడు రోజుల కిందట దహీ భల్లా(స్థానిక వంటకం) తన అన్న మొహసీన్‌‌కి ఇచ్చి రావాలని షారుక్ భార్యకి చెప్పాడు. ఆమె ఓ గిన్నెలో దహీ భల్లా తీసుకెళ్లింది. బావ మొహసీన్ వద్దనడంతో తమ గదికి వచ్చేసింది. అయినా భర్త వినిపించుకోకుండా మరోమారు వెళ్లమని చెప్పడంతో అయిష్టంగా వెళ్లింది.

దహీ భల్లా తీసుకెళ్లిన గిన్నెని బావ మొహసీన్ గదిలో విసిరికొట్టింది. దీంతో అతని భార్య ఆగ్రహంతో ఊగిపోతూ ఫరియాతో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి తన్నుకునే వరకూ వెళ్లారు. కొట్టుకుంటున్న తోడికోడళ్లని విడదీసేందుకు మొహసీన్ యత్నించాడు. అప్పటికే ఆగ్రహంతో రగిలిపోతున్న ఫరియా.. కత్తి తీసుకుని బావ మొహసీన్ కడుపులో పొడిచేసింది. రక్తపు మడుగులో కుప్పకూలిపోయిన మొహసీన్‌ను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.

బిల్డింగ్ పైనుంచి పడిపోవడంతో ఐరన్ రాడ్డు గుచ్చుకుందని కుటుంబ సభ్యులు వైద్యులకు
అబద్ధం చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మొహసీన్ ప్రాణాలు వదలడంతో పోలీసులకు సమాచారం అందించారు. సీన్‌లోకి ఖాకీలు రావడంతో అసలు నిజం బయటపడింది. బావని మరదలు పొడిచి చంపినట్లు ప్రాథమిక విచారణలో బయటపడడంతో నిందితురాలిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.