యాప్నగరం

‘నీ భార్యతో 8ఏళ్లు ఎంజాయ్ చేశా.. ఫోటోలు బయటపెడతా’మాజీ ప్రియురాలి భర్తకు బెదిరింపులు

ప్రియురాలితో ఏకాంత సమయంలో దిగిన ఫోటోలను ఆమె భర్తకు పంపించి వేధిస్తున్న వ్యక్తిని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఫోటోలు బయటపెడతానని బెదిరిస్తున్న దుర్మార్గుడు.

Samayam Telugu 24 Dec 2019, 3:24 pm
‘నీ భార్య నాతో ఎనిమిదేళ్ల పాటు ప్రేమాయణం నడిపింది. చాలాసార్లు శారీకరంగానూ ఎంజాయ్ చేశాం. ఆ సమయంలో న్యూడ్ ఫోటోలు తీసుకున్నాం. నేను చెప్పినట్లు వినకపోతే వాటిని సోషల్‌మీడియా పోస్ట్ చేస్తా’ అంటూ ఓ వ్యక్తి మాజీ ప్రియురాలి భర్తను వేధిస్తున్నాడు. అరసికెరె తాలూక అగ్గుందకు చెందిన వినయ్‌ (35) అనే వ్యక్తి గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువతిని ప్రేమించాడు. సుమారు 8ఏళ్లపాటు సాగిన వీరి ప్రేమాయణంలో ఇద్దరూ ఎన్నో హద్దులు దాటేశారు.
Samayam Telugu images (2)


Also Read: ప్రముఖ మోడల్స్‌తో వ్యభిచారం... రైడింగ్‌లో దొరికిన ఐదుగురు సెక్స్‌వర్కర్లు

చివరికి పెళ్లి సమయానికి వచ్చేసరికి పెద్దలు అడ్డుపడ్డారు. పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు ససేమిరా అనడంతో ఎదిరించి వెళ్లిపోయేందుకు ధైర్యం చాలక ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరు వ్యక్తులను పెళ్లిచేసుకున్నారు. ఇటీవల మాజీ ప్రియురాలు అతడి కంట పడటంతో వినయ్‌లోని దుర్మార్గుడు బయటకు వచ్చాడు. ఆమెతో ఏకాంతంగా గడిపిన సమయంలో తీసిన ఫోటోలను అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించాలకున్నాడు.

Also Read: యువతి వెన్నులో బుల్లెట్... సంచలనం విషయం వెలుగులోకి

ఆమె భర్త ఫోన్ నంబర్ సేకరించి ఫోన్ చేసి తన ప్రేమాయణం గురించి చెప్పాడు. ‘నీ భార్యతో 8ఏళ్లు ప్రేమాయణం నడిపి ఎంజాయ్ చేశాను. ఆ సమయంలో ఆమెను నగ్నంగా ఫోటోలు తీశా. నేను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని బయటపెడతా’ అంటూ వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధితుడు నేరుగా హాసన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వినయ్‌ను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: నదిలో పడిన బస్సు.. 24 మంది ప్రయాణికులు దుర్మరణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.