యాప్నగరం

సీఏఏ అనుకూల ర్యాలీ.. మసీదులోనే బీజేపీ రాష్ట్ర కార్యదర్శిపై దాడి

సీఏఏ అనుకూల ర్యాలీ నిర్వహించిన కొన్ని గంటల్లోనే బీజేపీ రాష్ట్ర కార్యదర్శిపై కొందరు దుండగులు మసీదులోనే దాడికి దిగాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Samayam Telugu 13 Jan 2020, 6:05 pm
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దేశం రెండుగా చీలిపోయింది. సీఏఏ అనుకూల వర్గం ఓ వైపు, వ్యతిరేకులు మరో వైపు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల ప్రదర్శనలు హింసాత్మకంగా మారుతున్నాయి. దాడులు, ప్రతి దాడులతో కొన్ని చోట్ల ఉద్రిక్తలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, కేరళలో పట్టపగలు ఏకంగా పవిత్ర మసీదులోనే బీజేపీ రాష్ట్ర కార్యదర్శిపై దాడులకు దిగారు. ఇదుక్కి జిల్లా నెదుంగందంలోని మసీదులో ఆ ఘటన చోటుచేసుకుంది.
Samayam Telugu attack


Also Read: ఎన్నారై భర్త వేధింపులు.. 2014లో ఇండియాలో వదిలేసి..

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఏకే నజీర్ ఆదివారం సీఏఏ అనుకూల ర్యాలీ నిర్వహించిన అనంతరం నెదుంగందంలోని తూక్కుపాలెం జుమాహ్ మజీదులో ప్రార్థన చేసుకునేందుకు వెళ్లారు. మసీదు ఇమామ్ కూడా ఆయన్ను ప్రార్థనలకు అనుమతించారు. అయితే వెనుక నుంచి కొందరు ఆయన్ను చుట్టుముట్టి.. ఆయనపై కుర్చీలతో దాడి చేసి, పిడిగుద్దులు గుద్దినట్లు బీజేపీ రాష్ట్ర శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో గాయపడ్డ నజీర్‌ను కొచ్చిలోని అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో చేర్పించారు.

అయితే ఈ దాడి వెనుక సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ), సీపీఎం అనుకూల డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్ఐ) కార్యకర్తలు ఉన్నట్లు బీజేపీ ఆరోపించింది. కాగా, అంతకు ముందు బీజేపీ నిర్వహించిన సీఏఏ అనుకూల ర్యాలీలో సైతం డీవైఎఫ్ఐ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించినట్లు ఎస్పీ ఎన్సీ రాజమోహన్ చెప్పారు.

Also Read: కళ్లకు గంతలు కట్టి సర్పంచ్‌ కిడ్నాప్.. గట్టిగా అరవడంతో..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.