యాప్నగరం

ప్రియుడితో మహిళా కానిస్టేబుల్ రాసలీలలు... రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

పోలీసు ఉద్యోగం చేస్తూ మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళా కానిస్టేబుల్‌ని ఆమె భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం జరిగింది.

Samayam Telugu 13 Feb 2020, 11:50 am
వివాహ కట్టుబాట్లను కాదని మరో వ్యక్తితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్న మహిళా కానిస్టేబుల్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు భర్త. ఈ ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెంలో మంగళవారం జరిగింది. భార్య తనను మోసం చేస్తూ మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Samayam Telugu illegal-affair_1200x900xt


Also Read: గర్భం దాల్చిన టెన్త్ బాలిక.. పెళ్లి చేసుకోనని మొహం చాటేసిన ప్రియుడు

గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం ప్యార్లి గ్రామానికి చెందిన సునీల్‌రాజ్‌ ఆర్మీలో పనిచేస్తున్నాడు. పదమూడేళ్ల క్రితం కంభం పట్టణానికి చెందిన మహిళా కానిస్టేబుల్ అనూషతో అతడికి వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. విధుల నిమిత్తం భర్తకు దూరంగా ఉండటంతో అనూష మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని గమనించి సునీల్ భార్య ప్రవర్తనపై గతంలో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆమెను అధికారులు సస్పెండ్ చేశారు. దీంతో కొద్దిరోజుల పాటు బుద్ధిగా ఉంది.

Also Read: కోడికూర కోసం ఘర్షణ.. రణరంగంగా మారిన పెళ్లి వేడుక

ఇటీవల వేటపాలెం పోలీస్‌స్టేషన్‌లో విధుల్లో చేరిన అనూష ప్రియుడితో మళ్లీ సంబంధం కొనసాగించడం మొదలుపెట్టింది. దీంతో విసిగిపోయిన సునీల్‌రాజ్ మంగళవారం రాత్రి ఆమె ప్రియుడితో గదిలో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. వెంటనే వేటపాలెం పీఎస్‌కు వెళ్లి ఆధారాలతో సహా భార్యపై ఫిర్యాదు చేశాడు.

Also Read: వాట్సాప్‌లో నగ్నచిత్రాలు పంపించి.. కోరిక తీర్చాలంటూ బాలికకు వేధింపులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.