యాప్నగరం

కోతి కోసం వేటాడుతూ కరెంట్ షాక్‌తో చిరుత మృతి

ఆహారం కోసం కోతిని వేటాడుతూ వెళ్లిన చిరుతపులి ప్రమాదవశాత్తూ ట్రాన్స్‌ఫార్మర్‌పై పడి ప్రాణాలు కోల్పోయింది. కోతి కూడా దానికంటే ముందే షాక్‌తో చనిపోయింది.

Samayam Telugu 14 Apr 2020, 12:09 pm
ఆహారం కోసం కోతిని పట్టుకునేందుకు ప్రయత్నించిన ఓ చిరుత పులి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబయి శివారులో వెలుగుచూసింది. కోతిపైకి దూకిన చిరుత ట్రాన్స్‌ఫర్‌పై పడి కరెంట్ షాక్‌తో చనిపోయింది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబవ్ గ్రామంలో ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో సోమవారం చిరుతపులి సంచరించింది.
Samayam Telugu pjimage (2)


Also Read: హైదరాబాదీలపై సైబర్ కేటుగాళ్ల కన్ను.. గంటల్లోనే రూ.లక్షలు కొట్టేశారు

ఆకలితో ఉన్న దానికి ఓ కోతి కనిపించింది. దీంతో కోతి చంపి తిని ఆకలి తీర్చుకోవాలనుకుంది. కోతి భయంతో ట్రాన్స్‌ఫార్మర్‌పైకి దూకగా.. చిరుత కూడా దానిపైకి దూకింది. దీంతో ఆ రెండూ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాయి. ట్రాన్స్‌‌ఫార్మర్‌పై చిరుత మృతదేహం వేలాడుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు కోతి, చిరుత కళేబరాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. లాక్‌డౌన్ కారణంగా జనసంచారం లేకపోవడం వల్లనే చిరుత ఆ ప్రాంతానికి వచ్చినట్లు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.

Also Read: వారిద్దరిదీ ఆత్మహత్యేనా? లేక వేరేదైనా?..మేడ్చల్ ఘటనపై అనేక అనుమానాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.