యాప్నగరం

హైదరాబాద్‌లో కామపిశాచి.. భర్త లేని సమయంలో ప్రియుడితో

భర్త కళ్లుగప్పి యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ అతడితో కలిసి బెడ్రూమ్‌లో రాసలీలలు కొనసాగించింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, యువకుడి బంధువులు ఆమెపై దాడి చేశారు.

Samayam Telugu 20 Apr 2020, 2:57 pm
వివాహేతర సంబంధాలు కాపురాలను నిలువునా కూలుస్తున్నాయి. భర్త కళ్లుగప్పి ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ ఏకంగా ఇంటినే రాసలీలల కేంద్రంగా మార్చేసింది. భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి రప్పించుకుని శృంగారంలో మునిగితేలుతూ స్థానికులకు పట్టుబడింది. సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్తతో కలిసి నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ఆమెకు అక్రమ సంబంధముంది.
Samayam Telugu 1490343957-0701


Also Read: పోలీసుల దెబ్బలు తాళలేక యువకుడి మృతి.. సత్తెనపల్లిలో దారుణం

భర్త కళ్లుగప్పి కొన్నా్ళ్లుగా ప్రియుడితో సంబంధాన్ని కొనసాగిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా కొద్దిరోజులుగా వారిద్దరు కలుసుకోవడం కుదరడం లేదు. దీంతో ఆ వివాహిత ప్రియుడి ఎడబాటు తట్టుకోలేకపోయింది. ఆదివారం ఆమె భర్త ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లగా వెంటనే ప్రియుడిని కబురు పెట్టింది. కొద్ది నిమిషాల్లోనే ఆమె ఇంటికి చేరుకున్న యువకుడు బెడ్రూమ్‌లోకి వెళ్లి రాసలీలలు మొదలుపెట్టాడు.

Also Read: లాక్‌డౌన్‌లో లిక్కర్ దందా... సినీనటుడు, అతడి ఫ్రెండ్స్ అరెస్ట్

ఈ విషయం తెలుసుకున్న యువకుడి కుటుంబసభ్యులు, బంధువులు మహిళ ఇంటికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో ఇద్దరినీ బయటకు లాగి .. నీ వల్లే మా పిల్లాడు పాడైపోయాడంటూ ఆ మహిళను చితక్కొట్టారు. వారి నుంచి తప్పించుకున్న మహిళ తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని స్థానికులను విచారించగా తాము దాడిచేయలేదని చెప్పారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: పులి నుంచి తప్పించుకున్నా భర్త కళ్లెదుటే ప్రాణం పోయింది.. కన్నీళ్లు పెట్టించే ఘటన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.