యాప్నగరం

కలిసి బతకలేక.. బాన్సువాడలో ప్రేమజంట ఆత్మహత్య

ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పారని మనస్థాపానికి గురైన ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. కలిసి బతకలేక.. విడిచి ఉండలేక ప్రాణాలు వదిలేసిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

Samayam Telugu 1 Feb 2020, 12:42 pm
మూడుముళ్లతో ఒక్కటి కాలేమని భావించిన ప్రేమ జంట చావుతో ఒక్కటైంది. పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో కుమిలిపోయిన జంట.. ఆత్మహత్య చేసుకుని లోకాన్ని విడిచింది. కన్నవాళ్లకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఊరికి దూరంగా అడవిలోకి వెళ్లి.. విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu love couple suicide


కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండలం టీకారం తండాకు చెందిన జయరామ్, లింగంపేట్ మండలం భవానిపేట్ తండాకు సోనీ కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. వివాహ బంధంతో ఒక్కటవ్వాలని భావించారు. కానీ వారి ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోరని భావించిన జయరామ్, సోనీ సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Also Read: ఔటర్ రింగ్‌రోడ్డుపై మరో ఘోర ప్రమాదం.. రంగారెడ్డిలో విషాదం

బాన్సువాడ మండలం మొగులాన్‌పల్లి అటవీ ప్రాంతానికి చేరుకున్న జయరామ్‌, సోనీ.. విషం తాగి ఆత్మహత్య చేసు1కున్నారు. అడవిలో విగతజీవులుగా పడిఉన్న ప్రేమజంటను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాన్సువాడ డీఎస్పీ దామోదర్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

Read Also:
నడిరోడ్డుపై భర్తను కొట్టి.. భార్య కిడ్నాప్.. నెల్లూరులో దారుణం

విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జయరామ్, సోనీ ఆత్మహత్య విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.