యాప్నగరం

Nalgonda: మంటల్లో కాలిపోయిన మూగప్రేమ.. కంటతడి పెట్టిస్తున్న యువతి వీడియో

ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడం నల్గొండ జిల్లాలో కలకలం రేపింది. యువతి వీడియో చూపరులను తీవ్రంగా కలచివేస్తోంది.

Samayam Telugu 11 Sep 2020, 7:10 am
పుట్టుకతో గొంతు మూగబోయినా.. మాటలు వినిపించకపోయినా.. మనసుతో మాట్లాడుకున్నారు. ప్రేమతో ఒక్కటయ్యారు. ఇద్దరూ కలకాలం కలిసి జీవించాలనుకున్నారు. కానీ.. సడెన్‌తో మంటల్లో కాలి బూడిదైపోయారు. ప్రియుడికి అప్పటికే వివాహం జరిగిపోవడమో.. తాము కలిసి బతికే అవకాశం ఈ జన్మకు లేదనుకున్నారో ఏమో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని అగ్నికి ఆహుతయ్యారు. చనిపోయే ముందు యువతి తన స్నేహితులకు కాల్ చేసి సైగలతో విషయం వివరిస్తున్న వీడియో కంటతడి పెట్టిస్తోంది.
Samayam Telugu వీడియో కాల్‌లో అశ్విని
suicide




నల్గొండ జిల్లా హాలియా సమీపంలో ప్రేమజంట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అనుముల మండలం, పాలెం గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు నగరంలోని శ్రీనివాసరావుపేటకు చెందిన మస్తాన్ వలి, నిజామాబాద్‌కి చెందిన అశ్విని హైదరాబాద్‌లోని ఓ సంస్థలో పనిచేసేవారు. ఇద్దరూ మూగ, చెవిటి వ్యక్తులు కావడంతో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది.

బైక్‌పై నాగార్జున సాగర్ వచ్చిన ప్రేమ జంట రోజంతా సరదాగా గడిపింది. తిరుగు ప్రయాణంలో హాలియా మండలం పాలెం వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతి చేసుకున్నారు. ఇద్దరూ మంట్లో కాలిపోయి ప్రాణాలు విడిచారు. ప్రియుడు వలికి గతంలోనే వివాహం జరగడం వల్లే ఇద్దరూ కలిసి బతకలేమని బలవన్మరణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. చనిపోయేందుకు కొద్ది సమయం ముందు యువతి అశ్విని తన స్నేహితులకు కాల్ చేసింది.

Also Read: తల్లిప్రేమ తనకి మాత్రమే దక్కాలని కూతురి ఘాతుకం.. శ్రీకాకుళంలో దారుణం

రోడ్డు పక్కన నిల్చుని వీడియో కాల్‌లో మాట్లాడుతూ తాను చెప్పాలనుకున్నది సైగలతో వివరించే ప్రయత్నం చేసింది. ఆమె దీనంగా సైగలు చేస్తూ ఇక బతకలేమని చెబుతున్నట్లుగా ఉన్న వీడియో కంటతడి పెట్టిస్తోంది. నిర్మానుష్య ప్రదేశం కావడంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సమయంలో ఎవరూ గమనించలేదని.. మంటల్లో ఇద్దరూ కాలిపోయి చనిపోయారని పోలీసులు తెలిపారు. యువతి కనిపించడం లేదంటూ రెండు రోజుల కిందటే హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ మిస్సింగ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

Read Also: ఆవారా అల్లుడికి అత్త ఆశ్రయం.. చివరికి.. వరంగల్‌లో ఘోరం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.