యాప్నగరం

అమరావతి: కరోనా టెస్ట్ పేరుతో యువతిపై లైంగిక దాడి.. ల్యాబ్ టెక్నీషియన్ పైశాచికం

కరోనా టెస్టు కోసం ల్యాబ్‌కు వచ్చిన యువతిపై టెక్నీషియన్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. జననాంగాల వద్ద శాంపిల్ తీసుకుంటే కరోనా ఫలితం కచ్చితంగా వస్తుందని నమ్మించాడు.

Samayam Telugu 31 Jul 2020, 9:44 am
కరోన టెస్ట్ కోసం ల్యాబ్‌కు వచ్చిన యువతి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఓ ల్యాబ్ టెక్నీషియన్ ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతిలో జరిగింది. అమరావతి పట్టణానికి చెందిన యువతి ఓ సంస్థలో పనిచేస్తోంది. ఇటీవల ఆమె సహోద్యోగికి కరోనా పాజిటివ్ రావడంతో తాను కూడా కరోనా టెస్ట్ చేయించుకోవాలనుకుంది. ఇందుకోసం ఓ ల్యాబ్‌కు వెళ్లగా అక్కడ పనిచేసే ఓ వ్యక్తి ఆమెపై కన్నేశాడు. కరోనా టెస్ట్ ఫలితం కచ్చితంగా రావాలంటే జననాంగం వద్ద కూడా శాంపిల్ సేకరించాలని ఆమెను నమ్మించాడు.
Samayam Telugu Image


Also Read: అక్కాచెల్లెళ్లపై 8 మంది గ్యాంగ్ రేప్.. వీడియోలతో బ్లాక్‌మెయిల్

యువతి సరేననడంతో ఆమె జననాంగం వద్ద శాంపిల్ సేకరిస్తున్నట్లు నటిస్తూ పాడుపని చేశాడు. ఇంటికెళ్లిన తర్వాత యువతి ఈ విషయాన్ని తన సోదరుడికి చెప్పడంతో అతడు షాకయ్యాడు. తనకు తెలిసిన డాక్టర్ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించగా కరోనా శాంపిళ్లను జనాంగం నుంచి సేకరించరని ఆయన స్పష్టం చేశారు. దీంతో తనను ల్యాబ్ టెక్నీషియన్ మోసం చేశాడని తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గురువారం అరెస్ట్ చేశారు. అతడు ఇంకెవరిపైనా ఇలాంటి పైశాచికానికి పాల్పడ్డాడా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also Read: మైనర్ బాలికలపై మామిడితోటలో అఘాయిత్యం, నిందితుడికి దేహశుద్ధి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.